Gardening Tips: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం – ఇంట్లోనే సహజ ఎరువు..!
నత్రజని, కాల్షియం, భాస్వరం వంటి పోషకాలు అందించే ఎముకల ఎరువును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మొక్కల వృద్ధికి సహాయపడుతుంది.

సరైన పోషకాలు
మొక్కల్ని పెంచడం అనేది ఒక సంతోషకరమైన పని. కానీ వాటిని ఆరోగ్యంగా పెంచాలంటే సరైన పోషకాలు తప్పనిసరి. ఎక్కువమంది దుకాణాల్లో దొరికే రసాయన ఎరువులను మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు వాడుతుంటారు. కానీ ఇవి ఖరీదైనవే కాకుండా, నేల, నీటి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అందుకే సహజంగా తయారయ్యే ఎరువులవైపు మొగ్గుచూపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చే ‘ఎముకల భోజనం’ అనే సహజ ఎరువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసం ఎముకలు
మనకు వంటింట్లో దొరికే మాంసం ఎముకలు మొక్కలకు చాలా బలాన్ని ఇస్తాయానే విషయం చాలా మందికి తెలియని విషయం. కోడి, చేప, మటన్ తినిన తర్వాత మిగిలిన ఎముకలను చాలా మంది పారేస్తుంటారు. అయితే ఇవే మంచి ఎరువుగా మారతాయని తెలుసా? ముఖ్యంగా మొక్కల పెరుగుదలకు అవసరమైన భాస్వరం, కాల్షియం ఈ ఎముకలలో అధికంగా ఉంటాయి. ఇవి పువ్వుల వికాసం, వేర్ల బలానికి ఎంతో అవసరం.
సహజ ఎరువు తయారీ
ఎముకలతో సహజ ఎరువు తయారీ విధానం చాలా సాధారణం. ముందుగా మాంసం తిన్న తర్వాత మిగిలిన ఎముకలను ఒక పాత్రలో వేసి బాగా మరిగించాలి. దీనివల్ల వాటికి అంటుకుని ఉండే మాంసం పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత ఈ ఎముకలను చల్లటి నీటిలో శుభ్రంగా కడిగి, ఎలాంటి మాంసం లేకుండా శుభ్రం చేసుకోవాలి.
మిక్సీలో వేసి మెత్తగా
ఆపై ఓవెన్ ఉంటే, అందులో ఈ ఎముకలను 175 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 20 నిమిషాలు వేడి చేయాలి. ఇది బ్యాక్టీరియా వంటి సూక్ష్మ జీవుల నుంచి ఎముకలను రక్షిస్తుంది. ఓవెన్ లేకపోతే ఎండలో ఎండబెట్టినా సరిపోతుంది. ఎముకలు పూర్తిగా పొడి కావాలి అంతే.
ఎముకల భోజనం
బాగా ఎండిన లేదా ఓవెన్‌లో వేయించిన ఎముకలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఇది సహజంగా తయారైన ఎముకల భోజనం. దీన్ని మొక్కల చుట్టూ నేలపై చల్లవచ్చు. లేదా నీటిలో కొద్దిగా కలిపి మొక్కల వేర్ల వద్ద పోయవచ్చు. దీన్ని నెలకు ఒకసారి వాడితే చాలు.
ఇది తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనాలు అందించే సొంత తయారీ ఎరువుగా మారుతుంది.
పారేసే వస్తువులను
ఈ విధంగా ఇంట్లో ఉండే పదార్థాలతో, పారేసే వస్తువులను ఉపయోగించి మనం సహజ ఎరువులను తయారుచేసుకోవచ్చు. ఇది మొక్కల ఆరోగ్యానికి, మన కుటుంబ ఆరోగ్యానికి, అంతే కాకుండా భవిష్యత్ తరాలకు ఒక ఎకో ఫ్రెండ్లీ ఆచరణగా నిలుస్తుంది.