మీ ఇంటి బాల్కనీ లేదా ఏదైనా చిన్న ప్లేసును తక్కువ బడ్జెట్‌లో అందమైన పూల తోటగా మార్చాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే. ఇంట్లో వాడి పక్కన పెట్టిన బకెట్లు, బాటిల్స్, ఇతర సామాన్లతో అందమైన కుండీలు తయారుచేసి మొక్కలు పెంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
Budget Gardening Tips: ఈ రోజుల్లో పట్టణాల్లో చాలామందికి ఇరుకు ఇళ్లలో ఉండటం వల్ల మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ అంతంగా ఉండదు. కాస్త ప్లేస్ ఉన్నా ఖర్చుకు భయపడి చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. నిజానికి, బాల్కనీలో మొక్కలు పెంచాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని అనుకోవడం పొరపాటు. దీనికి కావాల్సిందల్లా కాస్త క్రియేటివిటీ, సరైన ప్లానింగ్ మాత్రమే. కొంచెం తెలివిగా ఆలోచిస్తే, మీ ఇంటి బాల్కనీని ఒక అద్భుతమైన, అందమైన ప్రదేశంగా మార్చేయవచ్చు. అందమైన బాల్కనీ మీ ఇంటికి కొత్త అందాన్ని ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే బాల్కనీ గార్డెన్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తక్కువ బడ్జెట్‌లో మీ బాల్కనీ గార్డెన్‌ను అందంగా మార్చుకోవడానికి సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. పాత వస్తువులతో కుండీలు తయారు చేయడం, రంగురంగుల బట్టలతో అలంకరించడం, పాత ఫర్నిచర్‌కు కొత్త లుక్ ఇవ్వడం వంటివి మీ ఇంటి తోటను తాజాగా, ఆహ్లాదకరంగా మారుస్తాయి.
పాత సామాన్లతో కొత్త అందం
మీ బాల్కనీ గార్డెన్ కోసం పాడైన వస్తువులను తిరిగి వాడుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లు, పాత టైర్లు, టిన్ డబ్బాలు, పగిలిపోయిన కుండలు లేదా చెక్క పెట్టెలకు రంగులు వేసి అందమైన కుండీలుగా మార్చేయవచ్చు. దీనివల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా, మీ గార్డెన్‌కు ఒక యూనిక్ లుక్ వస్తుంది.

వేలాడే కుండీలు (హ్యాంగింగ్ పాట్స్) వాడకం
మీ బాల్కనీ గార్డెన్‌లో చిన్న మొక్కల కోసం, ప్లాస్టిక్ బాటిళ్లు లేదా కొబ్బరి చిప్పలను ఉపయోగించి వేలాడే కుండీలను తయారు చేసుకోండి. ఇది డబ్బు ఆదా చేసే ఉపాయం మాత్రమే కాదు, మీ గార్డెన్‌కు ఒక ప్రత్యేకమైన రూపాన్ని కూడా ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు పెద్దగా ఖర్చు ఉండదు, మీ తోట కూడా అందంగా కనిపిస్తుంది.
తక్కువ ఖర్చుతో లైటింగ్
మీ గార్డెన్‌ను ప్రకాశవంతంగా మార్చడానికి, ఖరీదైన లైట్ల బదులు ఫెయిరీ లైట్స్ లేదా సోలార్ లైట్లను వాడండి. ఇవి చాలా తక్కువ కరెంట్ తీసుకుంటాయి. రాత్రిపూట బాల్కనీలో ఒక మ్యాజికల్ వాతావరణాన్ని సృష్టిస్తాయి.

పాత ఫర్నిచర్‌కు కొత్త లుక్
కొత్త ఫర్నిచర్ కొనడానికి బదులుగా, మీ పాత కుర్చీలు, టేబుళ్లకు పాలిష్ చేయండి లేదా కొత్తగా పెయింట్ వేయండి. దీనివల్ల మీ డబ్బు ఆదా కావడమే కాకుండా, మీ గార్డెన్‌కు ఒక పాతకాలపు, హాయినిచ్చే లుక్ వస్తుంది.


