MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • ఈ వాచ్ మీ పిల్ల‌ల‌పై ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతుంది.. జీపీఎస్ ట్రాకింగ్‌తోపాటు ఎన్నో ఫీచ‌ర్లు

ఈ వాచ్ మీ పిల్ల‌ల‌పై ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంచుతుంది.. జీపీఎస్ ట్రాకింగ్‌తోపాటు ఎన్నో ఫీచ‌ర్లు

Smartwatch: చిన్న పిల్ల‌లు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లారంటే, ఇంటికి తిరిగి వ‌చ్చే వ‌ర‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అయితే మీ చిన్నారుల‌ను ఎప్పుడూ ఓ కంట క‌నిపెట్టే స్మార్ట్ వాచ్ ఉంటే భ‌లే ఉంటుంది క‌దూ! అలాంటి ఓ వాచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 04 2026, 09:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పిల్లల భద్రత కోసం GPS ట్రాకింగ్
Image Credit : Amazon.in

పిల్లల భద్రత కోసం GPS ట్రాకింగ్

బోట్ సేయిల‌ర్ నావ్ కిడ్స్ స్మార్ట్ వాచ్ పేరుతో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ అస‌లు ధ‌ర రూ. 7,999కాగా 25 శాతం డిస్కౌంట్‌తో రూ. 5999కి ల‌భిస్తోంది. ఈ వాచ్ పిల్లలు ఎక్కడ ఉన్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో 5 రకాల పొజిషనింగ్ టెక్నాలజీతో GPS ట్రాకింగ్ సదుపాయం ఉంది. boAt Sailor యాప్ ద్వారా పిల్లల ప్రస్తుత లొకేషన్, చివరిగా నమోదైన లొకేషన్, వాచ్ బ్యాటరీ స్థాయి, లొకేషన్ ఎప్పుడు అప్‌డేట్ అయిందనే వివరాలను చూడవచ్చు. అలాగే గూగుల్ మ్యాప్స్ ఆధారంగా లొకేషన్‌ను గుర్తించవచ్చు. స్కూల్, ట్యూషన్ సెంటర్, ఇంటి పరిసరాలు వంటి ప్రాంతాలను సేఫ్ జోన్‌గా సెట్ చేసుకోవచ్చు. పిల్లలు ఆ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు లేదా బయటకు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు అలర్ట్ వచ్చేలా జియో ఫెన్సింగ్ సదుపాయం పనిచేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
4Gతో వీడియో, వాయిస్ కాల్స్
Image Credit : Amazon.in

4Gతో వీడియో, వాయిస్ కాల్స్

ఈ స్మార్ట్‌వాచ్‌లో 4G SIM సపోర్ట్ ఉండటంతో పిల్లలతో నేరుగా వాయిస్ కాల్ చేయవచ్చు. అంతేకాదు, వాచ్‌లోని కెమెరా ద్వారా వీడియో, ఆడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. పిల్లలు కుటుంబ సభ్యులు, నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే మాట్లాడేలా తల్లిదండ్రులు యాప్‌లో ట్ర‌స్ట్‌డ్ కాంటాక్ట్స్‌ను ముందుగానే సెట్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా SOS ఫీచర్ కూడా ఉంది. వాచ్‌లోని పవర్ బటన్‌ను సుమారు 3 సెకన్లు నొక్కి ఉంచితే సేవ్ చేసిన ఎమర్జెన్సీ కాంటాక్టులకు కాల్ వెళ్లేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

35
కెమెరా, తల్లిదండ్రుల నియంత్రణ
Image Credit : Amazon.in

కెమెరా, తల్లిదండ్రుల నియంత్రణ

వాచ్‌లో 2MP కెమెరా ఉంటుంది. దీనితో పిల్లలు ఫొటోలు తీసుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా Sailor యాప్ ద్వారా కెమెరాను రిమోట్‌గా యాక్టివేట్ చేసి ఫొటో తీసుకునే సదుపాయం ఉంది. తీసిన ఫొటోలు యాప్‌లో చూడవచ్చు.

పిల్లలు వాచ్‌ను ఎలా ఉపయోగించాలో తల్లిదండ్రులు నియంత్రించేందుకు ఇందులో పలు పేరెంట‌ల్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. స్కూల్ సమయంలో డిస్ట్రాక్షన్ తగ్గించేందుకు క్లాస్ మోడ్ పెట్టుకోవచ్చు. అపరిచితుల కాల్స్‌ను నిరోధించడం, వీడియో చాట్‌ను ఆపివేయడం, డయల్ ప్యాడ్‌ను డిసేబుల్ చేయడం, వాచ్‌ను షట్‌డౌన్ చేయకుండా నిరోధించడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. అలాగే పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్లారో లోకేష‌న్ హిస్ట‌రీ ద్వారా తెలుసుకోవచ్చు.

45
పిల్లలకు ఉపయోగపడే డిస్‌ప్లే, ఫీచర్లు
Image Credit : Amazon.in

పిల్లలకు ఉపయోగపడే డిస్‌ప్లే, ఫీచర్లు

ఈ వాచ్‌లో 1.44 అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఉంది. పిల్లలు సులభంగా స్క్రీన్‌ను టచ్ చేసి కాల్స్ చేయడం, ఇతర ఫీచర్లను ఉపయోగించడం చేయవచ్చు. రోజంతా పిల్లలు ఎంత నడిచారో తెలుసుకునేందుకు స్టెప్ కౌంట‌ర్ కూడా ఉంది. అలాగే ఉదయం లేవడం, చదువుకునే సమయం వంటి వాటికి అలార‌మ్స్‌ సెట్ చేసుకోవచ్చు. వాచ్‌లోనే క్యాలిక్యులేట‌ర్‌, స్మార్ట్‌వాచ్ వంటి ఉపయోగకరమైన టూల్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆడుకునేందుకు కొన్ని కిడ్‌-ఫ్రెండ్లీ ఆఫ్‌లైన్ గేమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

55
పిల్లలకు స్మార్ట్‌వాచ్.. తల్లిదండ్రులకు భరోసా
Image Credit : Amazon.in

పిల్లలకు స్మార్ట్‌వాచ్.. తల్లిదండ్రులకు భరోసా

మొత్తంగా చూస్తే, బోట్ సేయిల‌ర్ నావ్ కిడ్స్ స్మార్ట్‌వాచ్ సాధారణంగా సమయం చూసుకోవడానికి మాత్రమే కాకుండా పిల్లల లొకేషన్ ట్రాకింగ్, కాల్స్, వీడియో కాల్స్, SOS, Safe Zone Alerts, Parental Controls వంటి భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా స్కూల్ లేదా ట్యూషన్‌కు ఒంటరిగా వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు లొకేషన్‌పై అవగాహన ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదే సమయంలో క్లాస్ మోడ్‌, స్ట్రేంజ‌ర్ కాల్ ప్రొటెక్ష‌న్ వంటి ఫీచర్లతో పిల్లల వాడకాన్ని కూడా నియంత్రించవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Door Bell: వైర్ అవ‌స‌రం లేదు, క‌రెంట్‌తో ప‌నే లేదు.. రూ. 500కే వైర్‌లెస్ డోర్‌బెల్
Recommended image2
JioBharat: యూపీఐ పేమెంట్స్‌, లైవ్ టీవీ.. రూ. 299కే జియో ఫోన్‌, ఎలాగంటే
Recommended image3
Lazy Glasses: ప‌డుకునే పుస్త‌కం చ‌ద‌వొచ్చు, టీవీ చూడొచ్చు.. లేజీ గ్లాసెస్‌తో ఎన్నో ఉప‌యోగాలు
Related Stories
Recommended image1
డ‌బ్బులుంటే ఇప్పుడే కొనేయండి.. త్వ‌ర‌లోనే ఈ ప్రాంతం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం
Recommended image2
హైద‌రాబాద్‌కు దూరంగా కొత్త రియ‌ల్ హ‌బ్‌.. ఐటీ ఉద్యోగుల చూపంతా అటు వైపే ఎందుకు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved