MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • Milk Packet Colors: పాల ప్యాకెట్ కలర్ కోడ్... ఏ రంగు ప్యాకెట్ లో ఏ పాలు ఉంటాయి..?

Milk Packet Colors: పాల ప్యాకెట్ కలర్ కోడ్... ఏ రంగు ప్యాకెట్ లో ఏ పాలు ఉంటాయి..?

Milk Packet Colors: మార్కెట్లో రంగు రంగుల పాల ప్యాకెట్స్ ఉంటాయి. అన్ని పాల ప్యాకెట్లు ఒకే రంగులో ఎందుకు ఉండవు? వాటి వెనక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? ఎవరు ఏ రంగు ప్యాకెట్ లో పాలు తాగాలి? ఏవి ఆరోగ్యానికి మంచిది?  

2 Min read
Author : ramya Sridhar
Published : May 08 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Milk Packets
Image Credit : Getty

Milk Packets

మనకు మార్కెట్లో రంగు రంగుల్లో పాల ప్యాకెట్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని పాల ప్యాకెట్స్ బ్లూ కలర్ లో ఉంటే, మరి కొన్ని గ్రీన్, ఆరెంజ్ రంగుల్లో ఉండటం ఎప్పుడైనా గమనించారా? ఒక్కో కంపెనీ ఒక్కో రంగు పాల ప్యాకెట్ అమ్ముతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ పాల ప్యాకెట్ కలర్ వెనక చాలా పెద్ద కథే ఉంది.

పాల ప్యాకెట్ కలర్ ని బట్టి.. ఆ ప్యాకెట్ లో ఎలాంటి పాలు ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, ఆ పాలల్లో ఫ్యాట్ ఎంత ఉందో వినియోగదారులు గుర్తించేందుకు వీలుగా ఈ రంగుల్లో పాల ప్యాకెట్లు అమ్ముతారు. పాల ప్యాకెట్ రంగును ఆధారంగా చేసుకొని సరైన పాలు కొనుగోలు చేయడంలో సహాయపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ రంగు ప్యాకెట్ లో ఎలాంటి పాలు ఉంటాయి..?
Image Credit : Chat GPT

ఏ రంగు ప్యాకెట్ లో ఎలాంటి పాలు ఉంటాయి..?

పాల ప్యాకెట్ నీలి రంగులో ఉంది అంటే.. ఆ ప్యాకెట్ లో ‘టోన్డ్ మిల్క్’ ఉంటాయి. వీటిలో 3 శాతం కంటే తక్కువ ఫ్యాట్ ఉంటుంది. పాలల్లో నుంచి ఫ్యాట్ తీసేసి.. ఆ పాలను ఈ కలర్ ప్యాకెట్ లో అమ్ముతారు.

అదే ఆరెంజ్ రంగులో లేదా మెజెంటా రంగులో ఉండే పాల ప్యాకెట్ లో ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి. అంటే.. ఈ పాలల్లో మీగడ చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువలో తక్కువ 6 శాతం ఫ్యాట్ ఉంటుంది.

ఆకుపచ్చ పాల ప్యాకెట్ లో తాజా పాలు ఉంటాయి. అంటే, ఈ పాలల్లో 4.5 శాతం ఫ్యాట్స్, 8.5 శాతం SNF ఉంటాయి. ఇక, మన దేశంలో చాలా కంపెనీలు.. ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలను పసుపు రంగు ప్యాకెట్లలో కూడా అమ్ముతుంటారు.

ఈ రంగులు ఎందుకు..?

పాలు కొనుక్కునే వినియోగదారులు.. ప్యాకెట్ మీద రాసి ఉన్న అక్షరాలు చూసి అందులో ఎలాంటి పాలు ఉంటాయి అని చదవాల్సిన అవసరం లేకుండా, కేవలం కలర్ చూసి.. ఏ పాలు కావాలో కొనుక్కోవడానికి సులువుగా ఉండేందుకు ఇలా రంగులు కేటాయించారు.

మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా పాల రకాలను గుర్తించడానికి రంగులు ఉపయోగిస్తారు. బ్రిటన్, అనేక యూరోపియన్ దేశాలలో, ఫుల్ క్రీమ్ ఉన్న పాలు నీలిరంగు ప్యాకెట్ లో, పాక్షికంగా ఫ్యాట్ తీసిన పాలు ఆకు పచ్చ రంగులో లభిస్తాయి. ఇంటర్నేషనల్ డైరీ ఫుడ్స్ అసోసియేషన్ ప్రకారం, అమెరికాలో ఫుల్ క్రీమ్ పాలు ఎరుపు రంగులో, తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు బ్లూ కలర్ లో లభిస్తాయి.

33
ఏ పాలు ఎవరు తీసుకోవాలి..?
Image Credit : Chat GPT

ఏ పాలు ఎవరు తీసుకోవాలి..?

మన దేశంలో ప్రజలు ఏదో ఒక రూపంలో పాలను తమ డైట్ లో భాగం చేసుకుంటూనే ఉంటారు. మీకు పల్చటి పాలు కావాలంటే స్కిమ్డ్ లేదా, టోన్డ్ మిల్క్ కొనుగోలు చేయాలి. అదే చిక్కటి పాలు కావాలంటే.. ఫుల్ క్రీమ్ మిల్క్ ఎంచుకోవచ్చు. హెల్త్ లైన్ ప్రకారం... ఫుల్ క్రీమ్ పిల్లలకు, క్రీడాకారులకు మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవారికి, గుండె సమస్యలు ఉన్నవారు స్కిమ్డ్, టోన్డ్ మిల్క్ తీసుకోవడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image2
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image3
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Onion Storage: ఇలా స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలు మొలకలు రావు, ఫ్రెష్ గా ఉంటాయి..
Recommended image2
Alcohol: మందు బాటిల్ ఒక్కసారి తెరిస్తే...ఎన్ని రోజుల్లో తాగేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved