Avacado: అవకాడో ఎంత మంచిదైనా... వీళ్లు మాత్రం తినకూడదు..!
Avacado: అవకాడో రుచి చాలా బాగుంటుంది. అంతేకాదు.. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే... ఆరోగ్యానికి ఎంత మంచిది అయినా.... ఈ అవకాడో ని.. కొందరు మాత్రం అస్సలు తినకూడదట.

Avacado
ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడే పండ్లలో అవకాడో ఒకటి. ఈ మధ్యకాలంలో చాలా మంది రెగ్యులర్ గా అవకాడో తింటున్నవారే. ఇతర పండ్లతో పోలిస్తే.. దీనిలో.. విటమిన్లు, ఖనిజాలు కూసంత ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అవకాడో రుచి చాలా బాగుంటుంది. అంతేకాదు.. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే... ఆరోగ్యానికి ఎంత మంచిది అయినా.... ఈ అవకాడో ని.. కొందరు మాత్రం అస్సలు తినకూడదట. మరి.. ఈ అవకాడోని ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....
మూత్ర పిండాలు, కాలేయ సమస్య ఉన్నవారు...
మీకు మూత్రపిండాల సమస్యలు ఉంటే, ఈ పండు తినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అవకాడోలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాలేయ సమస్యలు ఉన్నవారికి కూడా ఈ పండు మంచిది కాదు.
బరువు తగ్గాలనుకునేవారు
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, అవకాడోను మితంగా తినండి. ఈ పండు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉన్నప్పటికీ, ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దీనిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. బరువు తగ్గాలి అనుకునేవారు దీనిని మితంగా తినడమే మంచిది.
రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునేవారు
అవోకాడో లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునేవారు విటమిన్ కె తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా తీసుకోకుండా ఇలాంటి ఆహారం తీసుకోవడం మంచిది కాదు.
జీర్ణ సమస్యలు ఉన్నవారు
అవోకాడోలో ఫైబర్ , కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొంతమందిలో విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ పండును నివారించడం మంచిది.
లాటెక్స్ అలెర్జీ ఉన్నవారు
లాటెక్స్‌కు అలెర్జీ ఉన్నవారు ఈ పండును తినడం మానేయాలి. లాటెక్స్ అనేది సహజ రబ్బరు (రబ్బరు పాలు) నుంచి వచ్చే ఒక పదార్థం, దీనిని చేతి తొడుగులు, బెలూన్లు, మెట్రెస్‌ల వంటి ఉత్పత్తులలో వాడతారు. కొందరిలో, లాటెక్స్‌కు గురికావడం వల్ల లాటెక్స్ అలెర్జీ వస్తుంది. ఈ అవకాడో తినడం వల్ల కూడా ఇలాంటి అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి... అలాంటివారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.