- Home
- Telangana
- Hyderabad Food Tour : కేఫ్ నీలోఫర్ ఒక్కటే కాదు... పక్కా హైదరాబాదీ చాయ్ రుచిచూడాలంటే ఈ కేఫ్స్ కు వెళ్ళాల్సిందే
Hyderabad Food Tour : కేఫ్ నీలోఫర్ ఒక్కటే కాదు... పక్కా హైదరాబాదీ చాయ్ రుచిచూడాలంటే ఈ కేఫ్స్ కు వెళ్ళాల్సిందే
Hyderabad Food Tour : ఈ చల్లని వాతావరణంలో హైదరాబాద్ స్పెషల్ ఇరానీ చాయ్ తాగితే ఆ మజాయే వేరు. ఇలా నగరంలో తప్పకుండా టేస్ట్ చేయాల్సిన చాయ్ ని అందించే టాప్ 5 కేప్స్ ఇవే..

పక్కా హైదరాబాదీ చాయ్ దొరికే టాప్ 5 కేఫ్స్
Hyderabad Food Tour : మీరు ప్రకృతి అందాలను చూసేందుకు ఎకో టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లివుంటారు... మత విశ్వాసాలకు అనుగునంగా దేవాలయాలు, చర్చిలు, మసీదుల వంటి రిలిజియస్ టూరిస్ట్ ప్రాంతాలకూ వెళ్లివుంటారు... అడ్వెంచర్, కల్చరల్ టూరిస్ట్ ప్రాంతాలను చుట్టివచ్చివుంటారు... కానీ ఎప్పుడైనా ఫుడ్ టూరిజం ట్రై చేశారా? కనీసం ఇలాంటి టూరిజం గురించి విన్నారా? ఇటీవల కాలంలో ఇది బాగా పెరిగిపోయింది.
ఏమిటీ ఫుడ్ టూరిజం :
కేవలం కొన్నిప్రాంతాల్లో లభించే స్పెషల్ అహార పదార్థాల రుచిచూసేందుకు దేశవిదేశాలను చుట్టివచ్చేవారు పెరిగిపోయారు. దేశవ్యాప్తంగా కూడా కొన్ని అహారపదార్థాలకు కొన్నిప్రాంతాలు ఫేమస్... అక్కడ లభించే టేస్ట్ మరెక్కడా రాదు... అందుకే బాగా దూరమైన ఆ ప్రాంతాలను వెళ్లి తినేందుకే ఇష్టపడుతున్నారు... దీంతో దేశంలో కూడా ఫుడ్ టూరిజం బాగా పెరుగుతోంది.
అయితే మీరు హైదరాబాద్ లో కూడా ఫుడ్ టూరిజంను ఫీల్ కావచ్చు. హైదరాబాద్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది దమ్ బిర్యానీ, ఇరానీ ఛాయ్... ఇతర ప్రాంతాలనుండి నగరానికి వచ్చేవారు ఈ రెండింటి రుచి చూడకుండా ఉండలేరు. అయితే హైదరబాదీలు మాత్రం ఈ ఫుడ్ టూరిజం మజాను పొందలేకపోతున్నారు. ఈ వర్షాకాలంలో రుచికరమైన బిర్యానీ తిని, పొగలుకక్కే ఛాయ్ తాగుతుంటే ఆ మజాయే వేరు. కాబట్టి ఈ వీకెండ్ లో మీరు ఫుడ్ టూర్ ట్రై చేయవచ్చు... మీకోసమే నగరంలో టాప్ క్లాస్ ఛాయ్ ఎక్కడ దొరికే ప్రదేశాలను అందిస్తున్నాం.
హైదరాబాద్ లో టాప్ 5 కేఫ్స్
1. కేఫ్ నీలోఫర్ (Cafe Niloufer) :
'తింటే బిర్యానీ తినాలి.. తాగితే నీలోఫర్ లో చాయ్ తాగాలి'… ఇప్పుడు హైదరాబాద్ నడుస్తున్న ట్రెండ్ ఇది. నగరంలో ఉండేవారే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలనుండి కేఫ్ నీలోఫర్ లో ఛాయ్ తాగడానికి వస్తున్నారంటేనే ఇది ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు. అలాగని ఇక్కడ ఏ ఐదుపది రూపాయలకో టీ దొరుకుతుందనుకుంటే పొరబడినట్లే... ఓ సాధారణ రెస్టారెంట్ లో బిర్యానీ కంటే ఈ నీలోఫర్ చాయ్ ధరే ఎక్కువ. అయినా ఇక్కడ ఛాయ్, మస్కా బన్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. మీరు కూడా ఈ వీకెండ్ అలా సరదాగా హైటెక్ సిటీ దగ్గర్లో రాయదుర్గంలో గల నీలోఫర్ కి వెళ్ళి ఛాయ్ రుచిచూడవచ్చు... హైటెక్ హంగులతో కూడిన ఆ కేఫ్ ను కూడా చూసినట్లు ఉంటుంది.
2. నిమ్రా కేఫ్ (Nimra Cafe)
ఇది ఓల్డ్ సిటీలోని ప్రముఖ ఇరానీ ఛాయ్ పాయింట్. చార్మినార్ అందాలను చూసేందుకు, షాపింగ్ కు వెళ్లినవారు తప్పకుండా ఇక్కడ ఛాయ్ ని, రకరకాల బిస్కెట్స్ ని రుచిచూడవచ్చు. అసలైన హైదరాబాదీ ఛాయ్ రుచిచూడాలంటే ఈ కేఫ్ పర్పెక్ట్ ప్లేస్.
3. బ్లూ సీ కేఫ్ (Blue Sea Cafe)
ఇది కూడా ఇరాని చాయ్ కోసం ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ఒకటి... సికింద్రాబాద్ లో ఉంటుంది. ఇక్కడ లభించే రుచికరమైన చాయ్ ని హైదరాబాదీలు ఎంతగానో ఇష్టపడతారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు వెళ్లేవారు ఈ కేఫ్ లో ఇరానీ చాయ్ రుచిని ఆస్వాదించవచ్చు.
4. ఆల్ఫా హోటల్ (Alpha Hotel)
'ఆల్ఫా కేఫ్ లో కప్పు టీ తాగనిదే నా డే స్టార్ట్ అవదు' అంటూ ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది. ఇలా సినిమా డైలాగుల్లో వాడారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఛాయ్ ఎంత ఫేమస్సో. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ నుండి రాకపోకలు సాగించేవారికి ఆల్పా హోటల్ సుపరిచితమే. రైల్వే స్టేషన్ పక్కనేఉండే ఈ హోటల్లో మీరు చాయ్ తాగకుంటే ఓసారి ట్రై చేయవచ్చు.
5. అరకు చాయ్ (Araku Chai)
హైదరబాద్ లో ఆంధ్రా స్టైల్ చాయ్ కోరుకునేవారికి కెపిహెచ్బి, నిజాంపేట్ ప్రాంతాల్లోని అరకు చాయ్ పర్పెక్ట్ స్పాట్. ఇక్కడ సాంప్రదాయ పద్దతుల్లోనే కాదు ఆధునిక పద్దతుల్లోనూ తయారుచేసే టీ రుచిని ఆస్వాదించవచ్చు.
హైదరాబాద్ గల్లీగల్లీలో ఇరానీ కేప్ లు, చాయ్ బండీలు ఉంటాయి. కానీ స్పెషల్ గా చాయ్ తాగాలంటే మాత్రం ఇలాంటి ప్రాంతాలకు వెళ్లాలి. మీరు కూడా హైదరాబాద్ ఉంటే ఈ వీకెండ్ లో ప్రెండ్స్ తో కలిసి చాయ్ టూర్ ప్లాన్ చేయండి... ఈ చల్లచల్లని వాతావరణంలో వేడివేడి చాయ్ తాగుతుంటే ఆ మజాయే వేరు.