Watermelon: తెల్ల పుచ్చకాయ vs నల్లపుచ్చకాయ.. ఏది టేస్టీగా ఉంటుందో తెలుసా?
వేసవి కాలంలో విరివిగా దొరికే పండ్లల్లో పుచ్చకాయ ఒకటి. ఎండ వేడి నుంచి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా పుచ్చకాయలో మనకు ఎక్కువగా కనిపించేవి రెండు రకాలు. ఒకటి తెల్ల పుచ్చకాయ, రెండు నల్లపుచ్చకాయ. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ రుచిగా ఉంటుందో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పండ్లు తినాలని అంతా అనుకుంటారు. ఎండల వేడినుంచి ఉపశమనం పొందడానికి పుచ్చకాయ చాలా మంచిది. ఇందులో దాదాపు 90 శాతం నీళ్లే ఉంటాయి. పుచ్చకాయ శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అయితే పుచ్చకాయలో రెండు రకాలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి తెల్లటి, చారల పుచ్చకాయ, నల్లపుచ్చకాయ. అయితే ఈ రెండింటిలో ఏది టేస్టీగా ఉంటుందో.. ఎక్కువ మంది ఇష్టంగా తినే పుచ్చకాయ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పుచ్చకాయ ప్రయోజనాలు
పుచ్చకాయ చాలా రుచిగా ఉంటుంది. పుచ్చకాయలో నీరు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రించడంలోనూ పుచ్చకాయ సహాయపడుతుంది. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. తెల్ల పుచ్చకాయ, నల్లపుచ్చకాయ రెండూ ఈ గుణాలను కలిగి ఉంటాయి. కానీ రుచిలో మాత్రం కాస్త తేడా ఉంటుందని చెబుతుంటారు చాలామంది. మరి ఏది ఎక్కువ టేస్టీగా ఉంటుందో ఇక్కడ చూద్దాం.
నల్ల పుచ్చకాయ..
తెల్ల పుచ్చకాయతో పోలిస్తే నల్ల పుచ్చకాయను ఎక్కువ మంది కొనుగోలు చేస్తారట. వాటిని ఇష్టంగా తింటారట. అంతేకాదు నల్ల పుచ్చకాయ ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల వ్యాపారులు కూడా వీటిని పెద్ద మొత్తంలో తీసుకువచ్చి విక్రయిస్తూ ఉంటారట. తెల్ల పుచ్చకాయతో పోలిస్తే.. నల్ల పుచ్చకాయ ధర కాస్త ఎక్కువగా ఉంటుందట. నల్ల పుచ్చకాయ దాదాపు అన్ని కాలాల్లో దొరుకుతుంది.
తెల్ల పుచ్చకాయ..
తెల్ల పుచ్చకాయ, లేదా చారల పుచ్చకాయ కూడా మార్కెట్ లో విరివిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే నల్ల పుచ్చకాయతో పోలిస్తే.. తెల్ల పుచ్చకాయ ఎక్కువకాలం నిల్వ ఉండదట. రుచి కూడా కాస్త తక్కువగా ఉంటుందని చెబుతారు. అంతేకాదు ఈ పుచ్చకాయను ఒక్కసారి కట్ చేస్తే మరుసటి రోజుకు నిల్వ చేయడం కూడా కష్టమట. ఇది ఎక్కువ శాతం వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుందట. తెల్ల, నల్ల పుచ్చకాయల రుచిలో స్వల్ప తేడాలున్నా ప్రయోజనాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.