వీటికి నెయ్యిని రాస్తే మీ ముఖం మెరిసిపోతుంది.. ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది
నెయ్యిలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తాయి. అయితే మన శరీరంలో నాలుగు అవయవాలకు రోజూ నెయ్యిని రాయడం వల్ల మన స్కిన్ అందంగా మెరిసిపోతుంది.

నెయ్యి
నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి కేవలం ఒక్క శరీరానికి మాత్రమే చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. దీన్ని చర్మానికి పెట్టుకోవడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆయుర్వేదం ప్రకారం.. దీన్ని మన శరీరంలోని కొన్ని అవయవాలకు రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. ఆరోగ్యంగా బాగుంటుంది.
శరీరంలో ఏ అవయవాలకు నెయ్యిని రాసుకోవాలి?
పెదవులకు నెయ్యిని రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ లో తేమ లక్షణాలుంటాయి. ఇవి మన పెదవులను తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. నెయ్యిని పెదవులకు రాసుకోవడం వల్ల పెదవులు డ్రై గా కావు. పెదవులు పగిలే అవకాశం తగ్గుతుంది. నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు పెదవులను పగుళ్లను గ్గించడానికి సహాయపడతాయి.
అంతేకాదు నెయ్యి పెదవులను ఎక్స్ ఫోలియేట్ కూడా చేస్తుంది. దీన్ని పెట్టడం వల్ల పెదవులు స్మూత్ గా అవుతాయి.దీన్ని పెదవులకు రాసి సున్నితంగా మసాజ్ చేస్తే పెదవులపై ఉన్న చనిపోయిన కణాలు తొలగిపోతాయి. అంతేకాదు ఇది పెదవుల చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.
దీన్ని ఉపయోగించడం వల్ల పెదవులు బొద్దుగా కూడా అవుతాయి. నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని పెదవుల చుట్టూ రాయడంవల్ల పెదవుల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్లు, పుండ్లు, మొటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఇందుకోసం కొంచెం నెయ్యిని తీసుకుని పెదవులకు రాసి ఉదయాన్నే కడగాలి.
పాదాల అరికాళ్లకు నెయ్యిని రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు
అరికాళ్లకు నెయ్యి రాసి కాసేపు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా అలసట నుంచి ఉశమనం కలుగుతుంది. మీ పాదాలకు కొంచెం నెయ్యి రుద్దడం వల్ల మీరు బాగా నిద్రపోవచ్చు. గురక వచ్చే వారికి కూడా పాదాలకు నెయ్యి మసాజ్ ప్రయోజనకరంగా ఉంటుంది.
పాదాలకు నెయ్యితో మసాజ్ చేయడం వల్ల గురక వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనివల్ల నిద్రకు భంగం కలగదు. అంతేకాదు పాదాలకు నెయ్యిని రాయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, అపానవాయువు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఒంటి నొప్పులు కూడా తగ్గుతాయి. ఇందుకోసం రాత్రిపూట పాదాలకు నెయ్యి రాసి కాసేపు మసాజ్ చేయాలి.
జుట్టుకు నెయ్యిని రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు
నెయ్యిలో మన జుట్టుకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నెయ్యిని జుట్టుకు రాయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. అలాగే మూలాలకు మంచి పోషణ కూడా అదుతుంది. ఇది నేచురల్ కండీషనర్ లా పనిచేస్తుంది.
జుట్టుకు నెయ్యిని రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు తేమగా ఉంటుంది. దెబ్బతిన్న జుట్టు రిపేర్ అవుతుంది. అంతేకాదు నెయ్యి వల్ల జుట్టు మంచి షైనింగ్ కూడా వస్తుంది.
ఇందుకోసం గోరువెచ్చని నెయ్యిని జుట్టుకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి.