MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Food
  • ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్.. రెండింటిలో ఏంది మంచిదంటే?

ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్.. రెండింటిలో ఏంది మంచిదంటే?

గుడ్డు మంచి పోషకాహారం. దీనిలో ఎన్నో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కొంతమంది ఉడకబెట్టిన గుడ్డును తింటే మరికొంతమంది మాత్రం ఆమ్లేట్ తింటుంటారు. మరి ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 05 2024, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మన శరీరాన్ని బలంగా చేస్తాయి. అలాగే కండరాల మరమ్మత్తుకు, కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్లలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి మన ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి, గుండెను హెల్తీగా ఉంచడానికి కూడా ఇవి సహాయపడతాయి. అందుకే చాలా మంది గుడ్లను తింటుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే రెగ్యులర్ గా ఒకే రకమైన ఫుడ్  ను తినడం కాస్త బోరింగ్ నే ఉంటుంది.అందుకే చాలా మంది ఒక రోజు ఉడకబెట్టిన గుడ్డును తింటే మరొక రోజు ఆమ్లేట్, ఎగ్ కర్రీ అంటూ రకరకాలుగా చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా చాలా మంది ఆమ్లేట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే కొందరు గుడ్లను ఉడకబెట్టి మసాలా చేసి తినడానికి బాగా ఇష్టపడతారు. చాలా మంది ఉడకబెట్టిన గుడ్లు లేదా ఆమ్లెట్లనే తింటారు. అయితే ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్లలో ఏది ఆరోగ్యానికి మంచిదో అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ  ఆర్టికల్ ద్వారా ఏది ఎక్కువ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

ఉడకబెట్టిన గుడ్ల ప్రయోజనాలు

ఉడకబెట్టిన గుడ్లలో ఆమ్లెట్ల కంటే చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే ఇవి బరువు తగ్గడానికి  బాగా సహాయపడతాయి. 
గుడ్లను ఉడకబెట్టడం చాలా సులువు. అలాగే ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో మీరు గుడ్ల పోషకాలను పొందుతారు. 
ఉడకబెట్టిన గుడ్లలో ఆమ్లెట్ కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. ఎందుకంటే దీని కోసం మీరు నూనెను ఉపయోగించరు. 
 

45

ఆమ్లెట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆమ్లెట్ లో రకరకాల కూరగాయలు, మసాలా దినుసులను వేయొచ్చు. దీంతో ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది. 
ఆమ్లెట్ లో కూరగాయలు, ఇతర పదార్థాలను కలపడం వల్ల ఆమ్లెట్ లో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. దీంతో మీకు ఎక్కువ సేపు ఆకలి వేయదు. 
ఆమ్లెట్ ను తయారు చేసేటప్పుడు అవొకాడో, ఆలివ్ ఆయిల్ లేదా నట్స్ మొదలైనవి చేర్చుకుంటే మీకు ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

55

ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ లో ఏది తినాలి?

ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్లు రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ మీరు తక్కువ కేలరీలున్నదే తినాలంటే మాత్రం ఉడికించిన గుడ్లే బెస్ట్. అలాగే కేలరీలు ఎక్కువగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఆమ్లెట్ ను తినొచ్చు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved