ఉదయాన్నే మొలకలు తింటే ఏమౌతుందో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాలను తినాలి. ఆహారమే మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. అయితే చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని రోజూ పొద్దున్నే మొలకలను తింటుంటారు. ఇలా ఉదయాన్నే మొలకలను తింటే ఏమౌతుందో తెలుసా?
sprouts
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంత హెల్తీగా ఉంటే.. మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం రోజంతా మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అలాగే మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది ప్రతిరోజూ ఉదయాన్నే మొలకలను తింటుంటారు. మొలకలు ఆరోగ్యానికి మంచివని భావిస్తారు.నిజానికి మొలకలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో పెసర్ల మొలకలు ఒకటి. ఈ మొలకల్లో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఇతర పోషకాలకు మంచి వనరు. మొలకెత్తిన పెసరపప్పును మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
అల్పాహారంలో మొలకలను తినడం వల్ల మీరు ఆరోగ్యంగా, రీఫ్రెష్ గా ఉంటారు. వీటిని సలాడ్లు, శాండ్విచ్లు లేదా వేరే మార్గాల్లో తింటుంటరాు. నిజానికి మొలకలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు. ఉదయం అల్పాహారంలో మొలకలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మొలకలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
sprouts
సమృద్ధిగా పోషకాలు
మొలకల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. అలాగే మొలకెత్తిన పెసరపప్పులో మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, ప్రోటీన్, ఫైబర్ వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మొలకెత్తిన పెసరపప్పులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది.
Sprouts
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మొలకల్లో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే రోగాలతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. మొలకలను తింటే ఎన్నో రకాల వ్యాధులతో మన శరీరం పోరాడుతుంది.
బరువు తగ్గడానికి..
మొలకల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి మొలకలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి మంచిది
మొలకల్లో ఉండే ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే రక్తపోటును నార్మల్ గా ఉంచడానికి సహాయపడతాయి.
green gram sprouts
రక్తంలో చక్కెర నియంత్రణ
మొలకలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు ఈ మొలకలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉండదు.
చర్మం, జుట్టుకు ప్రయోజనకరం
మొలకల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, సిలికా వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.