ఒంట్లో రక్తం పెరగాలంటే ఏం తినాలి?
ప్రతి ఒక్కరి శరీరంలో తగినంత మొత్తంలో రక్తం ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మగవారితో పోలిస్తే ఆడవారే తక్కువ రక్తంతో బాధపడుతుంటారు. అయితే కొన్ని ఆహారాలను తింటే ఒంట్లో రక్తంలో ఇట్టే పెరుగుతుంది. అవేంటంటే?
కాలానికి అనుగుణంగా మన లైఫ్ స్టైల్ మారుతూ వస్తోంది. కానీ చెడు జీవనశైలి మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. వీటిలో ప్రధాన సమస్య శరీరంలో రక్తం స్థాయిలు తగ్గడం. కానీ ఒంట్లో రక్తం తక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యను ఫేస్ చేస్తున్న వారు.. ఏ పనీ చేయకున్నా బాగా అలసిపోవడం, బద్దకం, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన శరీరంలోని రక్తం ప్రతి భాగానికి ప్రతిరోధకాలను పంపుతుంది. దీంతో మన శరీరం మనకు హానిచేసే వైరస్ లు, బ్యాక్టీరియా మొదలైన వాటితో పోరాడగలదు. అందుకే ఈ సమస్యను లైట్ తీసుకోకూడదు. అందుకే సహజంగా ఒంట్లో రక్తాన్ని పెంచే కొన్ని ఆహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
leafy vegetables
ఆకుకూరలు
మన శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడానికి ఆకు కూరలు సహాయపడతాయి. ఇందుకోసం మీరు మీ రోజువారి ఆహారంలో బచ్చలికూర, పాలకూర, క్యాప్సికమ్, బ్రొకోలీ వంటి వాటిని చేర్చండి. వీటితో పాటు సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలను కూడా తినండి. వీటిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి12, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు మీ శరీరంలో హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడతాయి.
pomegranate
దానిమ్మ పండ్లు
దానిమ్మ పండ్లను తినడం వల్ల బ్లడ్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఈ పండ్లలో ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మీ ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నట్టైతే ప్రతి రోజూ ఒక దానిమ్మ పండును తినండి. లేదా దీని జ్యూస్ ను తాగండి. ఈ పండు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది.
ఖర్జూరం
శరీరంలో రక్తం లోపాన్ని తగ్గించడంలో ఖర్జూరా పండ్లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ పండ్లలో నేచురల్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఈ పండ్లను ఎక్కువగా తినకూడదు. వీళ్లు ఈ ఖర్జూరాలకు బదులుగా గుమ్మడికాయ గింజలను తినొచ్చు. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఒంట్లో రక్తాన్ని పెంచడానికి సహాయపడతాయి.
బీట్ రూట్
హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి బీట్ రూట్ చక్కగా పనిచేస్తుంది. అవును దీనిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కానీ ఇది టేస్టీగా ఉండదు. అందుకే చాలా మంది దీనిని తినరు. ఇలాంటప్పుడు మీరు దీన్ని ఇతర కూరగాయలతో సలాడ్ గా కలిపి తినొచ్చు. అయితే దీనిలో నల్ల ఉప్పు కలిపి తింటే మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
అరటి
అరటి పండును తింటే తక్షణ శక్తి అందుతుంది. అంతేకాదు ఈ పండును తినడం వల్ల శరీరంలో బ్లడ్ కౌంట్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ శరీరం ఫోలిక్ ఆమ్లాన్ని తయారు చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీనితో పాటుగా మీరు కూడా ఉసిరి కాయను కూడా తినొచ్చు. ఇది కూడా మీ శరీరంలో రక్తాన్ని బాగా పెంచడానికి సహాయపడుతుంది.