MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Cashew Apples: జీడి పండ్లు ఎక్కడ కనిపించినా కొని తినండి, దీని వల్ల మీరు ఊహించని లాభాలు

Cashew Apples: జీడి పండ్లు ఎక్కడ కనిపించినా కొని తినండి, దీని వల్ల మీరు ఊహించని లాభాలు

Cashew Apples: జీడిపప్పును ఇచ్చే జీడి పండ్లు పూర్వం ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పుడు ఇవి దొరకడమే కష్టంగా మారిపోయాయి. ఈ జీడి పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 25 2026, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జీడి పండ్లు అంటే ఏమిటి?
Image Credit : Getty

జీడి పండ్లు అంటే ఏమిటి?

గ్రామీణ ప్రాంతాల్లో జీడి చెట్లు అధికంగా కనిపిస్తాయి. జీడి పప్పు కోసం వీటిని పెంచుతారు. జీడి పప్పు ఖరీదైన డ్రైఫ్రూట్. జీడిపప్పుల గురించి జీడి తోటలను భారీగా పెంచుతారు. కానీ జీడి మామిడి పండును ఎవరూ పట్టించుకోరు. ఈ జీడి పండుకే చివర జీడి పప్పు కాస్తుంది. ఆ జీడిపప్పును తీసుకుని పండ్లు పారేస్తారు. పండు పక్వానికి వచ్చినప్పుడు నేలమీదే పడిపోతుంది. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం జీడి పండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన ఆహారం. ఈ పండులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండును ఆహారంలో చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు దక్కుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వీటిని తినడం వల్ల లాభాలు
Image Credit : Getty

వీటిని తినడం వల్ల లాభాలు

జీడి పండులో విటమిన్ సి అధికంగా స్థాయిలో ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. కాలం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. అలాంటి సమస్యల నుంచి రక్షణ పొందడానికి విటమిన్ సి అవసరం పడుతుంది. కాబట్టి జీడి పండును తినడం వల్ల విటమిన్ సి శరీరానికి అవసరమైనంత ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ పండును అధికంగా తీసుకుంటే ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారికి జీడి పండు ఉపయోగకరంగా ఉంటుంది. జీడి మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ పొట్ట పనితీరును మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయిపోతుంది కాబట్టి పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావు. మలబద్ధకం సమస్య కూడ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పండును తిన్న తర్వాత కడుపు తేలికగా ఉన్నట్టు అనిపిస్తుంది.

34
రక్త హీనత రాదు
Image Credit : Getty

రక్త హీనత రాదు

రక్తహీనత సమస్యతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు జీడి మామిడి పండు తింటే మంచిది. ఇది రక్త హీనత సమస్యలను చాలా వరకు అడ్డుకుంటుంది. ఇందులో ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరుగుతుంది. యువతులు, గర్భిణీలు ఐరన్ ఉన్న ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఇతర ఆహారాలతో పాటు జీడి మామిడి కూడా తీసుకుంటే ఆ సమస్య చాలా వరకు తొలగిపోతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఈ పండు మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. దీంతో చర్మం మెరిసిపోతుంది. ముఖంపై గీతలు, ముడతలు రాకుండా ఉంటాయి.

44
బరువు తగ్గుతారు
Image Credit : Getty

బరువు తగ్గుతారు

బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి జీడి పండు మంచి సహాయకారిగా ఉంటుంది. ఈ పండు తక్కువ కాలరీలతో పాటు ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. తిన్న వెంటనే తృప్తి కలిగించే పండు ఇది. దీంతో అనవసరమైన స్నాక్స్ తీసుకోవడం తగ్గి బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. పొటాషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇలాంటి సహజ ఆహారాలు కీలకమని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి జీడి పండును కూడా ఆహారంలో చేర్చడం మంచిది. ఈ పండును శుభ్రంగా కడిగి మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండు కొంచెం కషాయం రుచిగా అనిపించవచ్చు. కానీ ఇది ఎంతో ఆరోగ్యం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Astrology: ఈ 4 రాశుల వారికి పుట్టుకతోనే రాజయోగం, ధనవంతులగానే జీవిస్తారు
Recommended image2
Washing Machine: వాషింగ్ మెషీన్ కొనే ముందు ఈ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved