MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చేదుగా ఉన్నా ఖచ్చితంగా తినండి.. హెల్తీగా ఉంటారు..

చేదుగా ఉన్నా ఖచ్చితంగా తినండి.. హెల్తీగా ఉంటారు..

కాకరకాయ వంటి చేదుగా ఉన్న కొన్ని ఆహారాలను చాలా మంది తినరు. కానీ ఈ ఫుడ్స్ మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి చేదుగా ఉన్నా.. ఖచ్చితంగా తినాల్సిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 24 2024, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మనలో చాలా మంది చేదుగా ఉన్న ఫుడ్స్ ను అస్సలు తినరు. ఎందుకంటే ఇవి నోటినంతా చేదుగా చేస్తాయని. అవి ఎంత హెల్తీవైనా పక్కన పెట్టేస్తుంటారు. కానీ చేదు ఆహారాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే చేదుగా ఉన్నా.. తినాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కాకరకాయ

కాకరకాయ చేదుగా ఉంటుంది. అందుకే కొంతమంది దీన్ని అస్సలు తినరు. కానీ కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేదు కూరగాయలో ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, డైటరీ ఫైబర్స్, కాల్షియం మెండుగా ఉంటాయి. కాకరకాయను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా కళ్లు, కాలెయం ఆరోగ్యంగా ఉంటాయి. ఈ కూరగాయ మధుమేహాన్ని నియంత్రించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 
 

36

ఉసిరి

ఉసిరి ఒగరుగా, కాస్త చేదుగా ఉంటుంది. కానీ దీనిలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని తింటే మన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా.. చర్మం కూడా హెల్తీగా ఉంటుంది. ఇది జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

 

46
fenugreek

fenugreek


మెంతులు

మెంతులు కూడా చేదుగానే  ఉంటాయి. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మెంతులను మధుమేహాన్ని నియంత్రించడానికి ఉపయోగించొచ్చు. వీటిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. 

పసుపు

పసుపు ఎన్నో ఔషదగుణాలున్న మసాలా దినుసు. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. 
 

56

వేప ఆకులు

వేప ఆకులు కూడా ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
 

66

పనస పండు

పనస పండు పుల్లగా, చేదుగా, తీయగా ఉంటుంది. కొంతమంది దీనిని తినడానికి కూడా ఇష్టపడరు. కానీ ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండును తింటే మీరు హెల్తీగా ఉంటారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved