వీటిని రెగ్యులర్ గా తింటే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరుగుతుంది తెలుసా?
కొన్ని ఆహారాలను తింటే ఎలా అయితే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందో.. మరికొన్ని ఆహారాలను తింటే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహారాలను తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో పెద్దలతో పాటుగా చిన్న పిల్లలకు కూడా ఊబకాయంతో బాధపడుతున్నారు. కానీ ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. విసెరల్ బాడీ ఫ్యాట్ అని పిలువబడే ఈ కొవ్వు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మన కడుపు, కాలేయం, ప్రేగుల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే బెల్లీ ఫ్యాట్ విపరీతంగా పెరుగుతుంది. అయితే కొన్ని ఆహారాలను తింటే ఈ బెల్లీ ఫ్యాట్ కరుగుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే?
Mushrooms
పుట్టగొడుగులు
పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోయాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. పుట్టగొడుగుల్లో ఫైబర్ తో పాటుగా ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయని కనుగొన్నారు. పుట్టగొడుగుల్లో విటమిన్ డి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
పాలకూర
పాలకూర కూడా మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
బ్రోకలీ
బ్రోకలీ కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్స్ తో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరంలో కొవ్వు తగ్గడానికి సహాయపడతాయి.
Guava
జామపండు
కొన్ని రకాల పండ్లు కూడా మనం బరువు తగ్గడానికి సహాయపడతాయి. రోజూ ఒక జామ పండును తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
పైనాపిల్
పైనాపిల్ కూడా మనం ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిలో కొవ్వును కరిగించే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది.
అల్లం
అల్లాన్ని రెగ్యులర్ కూరలో వేస్తారు. ఇది కూరల రుచిని పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.