MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Weight Loss: బోర్ కొట్టినా సరే.. ఈ ఒక్క టిఫిన్ తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు!

Weight Loss: బోర్ కొట్టినా సరే.. ఈ ఒక్క టిఫిన్ తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు!

అధిక బరువు.. ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. గజిబిజి లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, కూర్చొని చేసే ఉద్యోగాలు ఇతర కారణాల వల్ల బరువు పెరగడం సాధారణం అయిపోయింది. చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొందరు రోజూ వ్యాయామం చేస్తారు. మరికొందరు చిన్నపాటి వ్యాయమాలతో పాటు మంచి డైట్ ఫాలో అవుతూ ఉంటారు. బరువు తగ్గడం, పెరగడం అంత ఈజీ ఏం కాదు. కానీ ఇడ్లీ, సాంబార్ తింటూ ఈజీగా బరువు తగ్గొచ్చనే విషయం మీకు తెలుసా? ఎలాగో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 10 2025, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది అతని బరువును బట్టి ఈజీగా చెప్పొచ్చు అంటారు ఆరోగ్య నిపుణులు. జీవనశైలి మారుతున్న కొద్దీ ఊబకాయం పెరుగుతోంది. తిన్నది జీర్ణం కాకపోవడం, కొంచెం నడిచినా కాలు నొప్పి, నడుము నొప్పి సహా రకరకాల సమస్యలు రావడం ప్రస్తుతం సాధారణం అయిపోయింది.

అయితే, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ముందు చెప్పేది బరువు తగ్గాలి లేదా బరువు పెరగాలి. బరువు పెంచుకునే వాళ్లది ఒక రకమైన సమస్య అయితే తగ్గాలనుకునే వారిది మరోక రకమైన సమస్య. రెండూ కష్టంతో కూడుకున్నవే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏ ఫుడ్ తింటే మంచిది?

ఏ ఫుడ్ తింటే మంచిది?

బరువు తగ్గాలనుకునే వారు ముందుగా ఫాలో అయ్యేది వాకింగ్ తర్వాత జిమ్, యోగా చేస్తుంటారు. ఇంట్లో ఉంటే డైట్ చేయొచ్చు కానీ బయట ఉంటే? ఒకవేళ ప్రయాణాలు చేస్తుంటే? అప్పుడు ఏం చేయాలి? బరువు తగ్గడానికి ఏం తినాలో ఇక్కడ చూద్దాం.

ఓ అధ్యయనం ప్రకారం ప్రయాణం చేసేటప్పుడు లేదా బయట ఆహారం తీసుకునేటప్పుడు కొంచెం కఠినంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తినే బదులు ఇడ్లీ సాంబార్ తినచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

34
బరువు తగ్గడానికి ఇడ్లీ, సాంబార్

బరువు తగ్గడానికి ఇడ్లీ, సాంబార్

ఇడ్లీ, సాంబార్ బయట ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాదు ఇడ్లీ సాంబార్ తింటూ బరువు కూడా తగ్గించుకోవచ్చు. వీటిని బియ్యం, మినపప్పు, అటుకులు నానబెట్టి రుబ్బి చేస్తారు. సాంబార్‌లో కూరగాయలు ఉంటాయి. కాబట్టి నిశ్చింతగా తినచ్చు. ఒకటి, రెండు ఇడ్లీలు ఎక్స్‌ట్రా తిన్నా సమస్య లేదు. కొబ్బరి చట్నీతో తింటే ఇంకా మంచిది.

44
మెరుగైన జీర్ణక్రియ

మెరుగైన జీర్ణక్రియ

ఇడ్లీ, సాంబార్ కాంబినేషన్ బాగుంటుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్లేవాళ్లు బయట తినాలంటే ఇడ్లీ తినడం మంచిది. బోర్ కొట్టినా సరే ఇడ్లీనే తినమని చెబుతుంటారు నిపుణులు. దీనివల్ల నెలకు కేజీ నుంచి 2 కేజీల వరకు బరువు ఈజీగా తగ్గొచ్చట.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Recommended image3
Mutton Roast: మటన్ వేపుడు ఇలా చేశారంటే.. మీ ఫ్యామిలీ మొత్తం ఫిదా అవ్వాల్సిందే. స్వ‌ర్గం అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved