MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Summer Foods: సమ్మర్‍లో ఈ కూరగాయలు అస్సలు తినొద్దు..తింటే ఏమవుతుందో తెలుసా?

Summer Foods: సమ్మర్‍లో ఈ కూరగాయలు అస్సలు తినొద్దు..తింటే ఏమవుతుందో తెలుసా?

Summer Foods: ఎండలు మండిపోతున్నప్పుడు మన శరీరాన్ని కూల్‍గా ఉంచే ఆహారం మాత్రమే తీసుకోవాలి. కానీ కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి మంచివైనప్పటికీ, వేసవిలో మాత్రం ఒంట్లో వేడిని అమాంతం పెంచేస్తాయి. అందుకే వేసవిలో ఏవి తినాలి? ఏని తినకూడదో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : May 08 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేసవిలో తినకూడని కూరగాయలు
Image Credit : AI generated

వేసవిలో తినకూడని కూరగాయలు

సమ్మర్‍లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారం, వేసుకునే బట్టలు అన్నింటికన్నా ముఖ్యం. ఈ వేసవిలో బయట చల్లదనం కన్నా బాడీలో చల్లదనం కావాలి. అలా కావాలంటే మనం తినే ఆహారం ఎలా ఉందో చూసుకోవాలి. వేడి చేసే ఫుడ్ తింటే శరీరంలో ఇంకాస్త వేడి పెరిగి అనేక సమస్యలు వస్తాయి. జీర్ణం కాకపోవడం, విరోచనాలు, ముఖం డ్రై అయిపోవడం, యూరిన్ పసుపు రంగులో వచ్చి మంట పుట్టడం, మొటిమలు..ఇలా బోల్డెన్ని సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ వేసవిలో మనం తినే ఆహారం దృష్టి పెట్టాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వంకాయ
Image Credit : Getty

వంకాయ

వంకాయ అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. కానీ వంకాయ వేడి చేసే గుణం ఉండటం వల్ల…అది తింటే శరీరంలో ఇంకాస్త వేడి పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్కువగా తింటే అసిడిటీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, దీన్ని వేయించకుండా, తక్కువ నూనె, మసాలాలతో వండుకుని తినడం ఉత్తమం.

Related Articles

Related image1
Hair Packs: ఈ బ్యూటీ సీక్రెట్‍తో జుట్టు మోకాళ్ల వరకు పెరగడం గ్యారెంటీ
Related image2
Hair Care:ఎండాకాలంలో జుట్టు పట్టుకుచ్చులా మెరవాలా? ఇలా చేస్తే చాలు
34
మునగకాయ
Image Credit : Getty

మునగకాయ

మునగకాయ, దాని ఆకులు కూడా పోషకాలతో నిండి ఉంటాయి. కానీ ఇది కూడా శరీర ఉష్ణోగ్రతను పెంచే కూరగాయల్లో ఒకటి. ఇటీవల దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎక్కువగా ప్రచారం జరగడంతో, చాలామంది రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మొదలుపెట్టారు. అయినప్పటికీ, వేసవి కాలంలో దీన్ని ఎక్కువగా తినకుండా, మితంగా తీసుకోవాలి.

అయితే మునగాకులో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి…ఆపరేషన్లు చేయించుకునేవాళ్లు, బాలింతలు…ఈ మునగాకు తింటే కుట్లు త్వరగా కలిసిపోతాయి. కానీ సమ్మర్ కాబట్టి…కాస్త మితంగా తినడం చాలా మంచిది.

44
ఉల్లిపాయ
Image Credit : Getty

ఉల్లిపాయ

ఉల్లిపాయను చలవ చేసే ఆహారంగా భావించినా, దానిలోని ఘాటు వల్ల ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. అలాగే, నూనెలో బాగా వేయించిన పదార్థాలు, కారంతో కూడిన మసాలా వంటకాలను వేసవిలో తినకపోవడమే మంచిది. శరీరం తేలికగా జీర్ణించుకోగల, తక్కువ మసాలా, తక్కువ నూనె ఉన్న ఆహారం తీసుకుంటే శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.

మరీ ముఖ్యంగా పెరుగుకు దూరంగా ఉండండి. దానికి బదులు మజ్జిగ తాగండి. పెరుగు తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. మజ్జిగ చలవ చేస్తుంది. ఇంకా కావాలంటే గంజిని పులియబెట్టి దాంట్లో కాస్త ఉప్పు, పంచదార కలిపి తాగినా బాడీ వెంటనే కూల్ అయిపోతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Hair Packs: ఈ బ్యూటీ సీక్రెట్‍తో జుట్టు మోకాళ్ల వరకు పెరగడం గ్యారెంటీ
Recommended image2
Hair Care:ఎండాకాలంలో జుట్టు పట్టుకుచ్చులా మెరవాలా? ఇలా చేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved