Biryani: భారతదేశంలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
బిర్యానీ పేరు వింటేనే నోరూరుతుంది కదా. మన దేశంలో వివిధ రకాల టేస్టులో, డిఫరెంట్ ప్లేవర్స్ తో బిర్యానీలు దొరుకుతాయి. మరి, మన దేశం మొత్తంలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో చసేయండి..

ఈ రోజుల్లో బిర్యానీ ని ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా? ఆ పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా.. మన దేశంలో ఎక్కడైనా బిర్యానీ దొరుకుతుంది. ఒక్కో బిర్యానీ ఒక్కో రుచి ఉంటుంది. ఒక్కో ఫ్లేవర్ కూడా ఉంటుంది. మరి, దేశంలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుందామా...
ప్రతి సంవత్సరం జూలై 3న ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, భారతీయులకు దీనికి ప్రత్యేక స్థానం ఉంది. బిర్యానీ శాకాహార, మాంసాహార రెండు రకాలుగా లభిస్తుంది. రుచికరమైన బిర్యానీ అందించే భారతదేశంలోని 5 ప్రదేశాల జాబితా ఇక్కడ ఉంది.
బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి. కొబ్బరిపాలు బిర్యానీ, ఇది కేరళలో ఎక్కువగా చేస్తారు. దిండిగల్ బిర్యానీ, చెట్టినాడ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, మొఘల్ బిర్యానీ, వేలూరు బిర్యానీ ఇలా ప్రతి ఒక్కరికీ వేరే వేరే బిర్యానీ ఇష్టం.
దిండిగల్ తలపాకట్టి:
దక్షిణ భారత రుచులు మీకు ఇష్టమైతే, చెన్నై దిండిగల్ తలపాకట్టి పది సంవత్సరాల క్రితం నాగస్వామి నాయుడు ప్రారంభించారు. ఇక్కడ అందించే బిర్యానీ అత్యుత్తమ నాణ్యతతో ఉంటుంది. బాస్మతి, జీరా సాంబా, పొన్నీ బియ్యంతో, గొర్రెపిల్ల ముక్కలతో వండుతారు. దీని పరిమళం పది వీధుల వరకు వ్యాపిస్తుందని చెబుతారు.
ఆంబూర్ బిర్యానీ:
రుచి, ప్రత్యేకత కారణంగా ఆంబూర్ బిర్యానీ అనే పేరుతోనే ప్రసిద్ధి చెందింది. ఆంబూర్‌లో తయారుచేసే బిర్యానీ కోడి, మటన్, మంచి బాస్మతి బియ్యం, మంచి మసాలా దినుసులతో పాలార్ నీటితో తయారు చేస్తారు, దీనివల్ల దీని రుచి నోరూరిస్తుంది.
ఢిల్లీ నసీర్ ఇక్బాల్ రుచికరమైన మటన్ బిర్యానీ:
ఢిల్లీలోని నసీర్ ఇక్బాల్ రుచికరమైన మటన్ బిర్యానీని సువాసన బియ్యం, మాంసం, పచ్చిమిర్చితో తయారు చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంటకం అని చెప్పవచ్చు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న, సాంప్రదాయ ఇనుప పాత్రలను ఉపయోగిస్తారు. ఇందులో మటన్ స్టాక్ అని పిలువబడే ఉడికించిన నీటిని ఉపయోగిస్తారు.
లల్లా బిర్యానీ
లక్నోలోని చౌబట్టియన్ చౌక్‌లో ఉన్న లల్లా బిర్యానీ, పూర్తిగా స్వచ్ఛమైన మాంసం, సువాసన బియ్యంతో తయారు చేస్తారు. బిర్యానీ పరిమళం, రుచి నాలుకను నోరూరిస్తాయి.