బరువు తగ్గించే బెస్ట్ మెడిసిన్.. అది కూడా అన్నంతో..!
మిగిలిన అన్నాన్ని మట్టి కుండలో ఉంచండి. దానికి నీరు కలపండి. రాత్రిపూట వదిలివేయండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే చాలా మంచిదట.
మన దగ్గర అందరం దాదాపు భోజనంగా అన్నమే తింటాం. ఉదయం, రాత్రి రెండుపూటలా అన్నం వండుకొని తినేస్తాం. అయితే.. ఒక్కోసారి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. దీంతో చాలా మంది దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి తరువాతి రోజు తింటారు. లేదా.. ఏ ఆవు లాంటి జంతువుకో పెట్టేస్తారు. లేదంటే పడేస్తారు. అయితే.. ఆ అన్నం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.
అవును, రోజుకు చద్దన్నం తినడం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో అనేక సూక్ష్మపోషకాలు, ఖనిజాలు మరియు ఐరన్, పొటాషియం మరియు కాల్షియం వంటి ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి చేరుతాయి. అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మిగిలిపోయిన అన్నాన్ని ఎలా తీసుకుంటే ప్రయోజనాలున్నాయో... ఇప్పుడు చూద్దాం..
మిగిలిన అన్నాన్ని మట్టి కుండలో ఉంచండి. దానికి నీరు కలపండి. రాత్రిపూట వదిలివేయండి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే చాలా మంచిదట.
మీకు కనుక స్టమక్ అల్సర్స్ ఉంటే, వారానికి రెండు, మూడు సార్లు ఇలా చద్దన్నం తినడం వల్ల తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎండాకాలం చద్దన్నం తినడం వల్ల చాలా హాయిగా ఉంటుందట. శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందట.
బరువు తగ్గాలని అనుకునేవారు కూడా చద్దన్నం తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారట. వేడన్నంలో ఉన్న క్యాలరీలు.. చద్దన్నంలో ఉండవట. దీంతో.. బరువు నియంత్రణలో ఉంటుంది.
అంతేకాదు చద్దన్నంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన చాలా సేపటి వరకు మళ్లీ ఆకలిగా అనిపించదు. దీంతో.. బరువు నియంత్రణలో ఉంటుంది.
చద్దన్నం మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది . ప్రస్తుతం దాదాపు అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. ప్రశాంతంగా కూర్చొని తినడానికి లేదా నిద్రించడానికి సమయం లేదు. ఉదయం, బయటికి వెళ్లి మీ వద్ద ఉన్నదాన్ని తినడం సాధారణం. అటువంటి పరిస్థితిలో అనారోగ్య సమస్యలు రావడం మొదలౌతాయి.
కడుపు, నొప్పి, తిమ్మిరి, అజీర్ణం మరియు మలబద్దకంలో గ్యాస్ సమస్య మొదలవుతుంది. మనలో 44–45 శాతం మంది మలబద్దకంతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో.. చద్దన్నం తినేవారు ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.