MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ChintaChiguru: చింతచిగురు కోడిగుడ్డు.. ఇలా చేసి తింటే.. మటన్ కూడా పనికి రాదు..!

ChintaChiguru: చింతచిగురు కోడిగుడ్డు.. ఇలా చేసి తింటే.. మటన్ కూడా పనికి రాదు..!

ఉద్యోగాలు చేసే మహిళలకు రోజూ రకరకాల వంటలు చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు.. కేవలం ఐదు నిమిషాల్లో తయారు చేసే చింతచిగురు కోడిగుడ్డు కూర చేసేయండి. కూర వండటం సులభం. టేస్ట్ కూడా అదిరిపోతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 07 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చింత చిగురు
Image Credit : chatGpt

చింత చిగురు

ప్రస్తుతం మార్కెట్లో చింత చిగురు చాలా సులభంగా లభిస్తుంది. నార్మల్ గా మనం వంటలో పులుపు కోసం చింత పండు వాడుతూ ఉంటాం. ఈ చింతపండు మనకు అన్ని సీజన్లలో ఈజీగా లభిస్తుంది. కానీ, చింత చిగురు మాత్రం.. ఈ ఎండాకాలంలోనే లభిస్తుంది. ఈ చిగురు ధర కూడా కాస్త ఎక్కువే. కానీ.. అప్పుడప్పుడైనా దీనితో రకరకాల వంటలు చేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. మరి, ఈ రోజు చాలా సింపుల్ గా తయారు చేయగల చింతచిగురు కోడిగుడ్డు కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం....

23
మంచి చింత చిగురు ఎంచుకోవాలి...
Image Credit : our own

మంచి చింత చిగురు ఎంచుకోవాలి...

మార్కెట్లో చింత చిగురు ఎంచుకొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది నీళ్లు చల్లి అమ్ముతుంటారు. అలాంటి నీళ్లు చల్లినది తూకంలో బరువు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు... బయట ఎండలకు తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా నీరు చల్లినది ఆకు ఎంచుకోవాలి. ఈ ఆకు మాత్రమే రుచిగా ఉంటుంది.

Related Articles

Related image1
Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?
Related image2
Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే
33
చింతచిగురు కోడిగుడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
Image Credit : chatGpt

చింతచిగురు కోడిగుడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

ఉల్లిపాయ, చింత చిగురు, కోడిగుడ్డు, ఉప్పు, కారం ఉంటే  చాలు.. ఇంకేమీ అవసరం లేదు…

తయారీ విధానం... ముందుగా... చింత చిగురులో పుల్లలు, కొమ్మలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తర్వాత.. ఆ ఆకును చేతితో కొద్దిగా నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత.. ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత.. చింత చిగురు కూడా వేసుకోవాలి. రెండు నిమిషాలు వేయించిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు మూడు లేదా నాలుగు కోడిగుడ్లు పగలగొట్టి.. అందులో కార్చాలి. రెండు నిమిషాలు మూతపెట్టి.. తర్వాత గంటతో కదిలించాలి. ఇప్పుడు కావాలంటే రుచికి సరిపడా ఉప్పు,కారం వేసుకోవచ్చు. అంతే కూర అయిపోయినట్లే. రుచి అద్భుతంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే..చాలా బాగుంటుంది. తక్కువ సమయం ఉన్నప్పుడు ఇలాంటి కూరలో ట్రై చేయవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Expensive Fruits: కిలో మామిడి ధ‌ర రూ. 2 ల‌క్ష‌లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన పండ్లు ఇవే
Recommended image2
Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే
Recommended image3
Goat vs Sheep: మేకకు, గొర్రెకు మ‌ధ్య తేడా ఏంటి.? రెండింటిలో ఆరోగ్యానికి ఏ మ‌ట‌న్ మంచిది.?
Related Stories
Recommended image1
Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?
Recommended image2
Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved