MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Food
  • Dal: పప్పులో నీళ్లు ఎక్కువయ్యాయా? చిటికెలో చిక్కగా మార్చేయచ్చు

Dal: పప్పులో నీళ్లు ఎక్కువయ్యాయా? చిటికెలో చిక్కగా మార్చేయచ్చు

Dal:  పప్పు వండేటప్పుడు.. ఒక్కోసారి నీళ్లు ఎక్కువైపోతాయి. దీని వల్ల పప్పు పలచగా మారిపోతుంది. ఇలా మారిన పప్పు రుచి ఉండదు. తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే, ఒకే ఒక్క సింపుల్ చిట్కాతో మళ్లీ చిక్కగా మార్చచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 29 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Dal
Image Credit : AI Image

Dal

భారతీయులు రెగ్యులర్ గా చేసే వంటల్లో పప్పు ముందు వరసలో ఉంటుంది.  అయితే.. చాలా మంది పప్పు తొందరగా ఉండకాలని లేదా, కొలత సరిగా తెలీకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా పోసేస్తూ ఉంటారు. దీని వల్ల నీళ్లు ఎక్కువై.. పప్పు కాస్త పప్పు చారులా మారిపోతుంది. ఇలా పలచగా ఉన్న పప్పు చారు రుచిగా ఉండదు. తినలేం.  అలాంటప్పుడు దాన్ని పారేయలేక, తినలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ, కొన్ని సింపుల్ చిట్కాలతో  పలచగా మారిన పప్పును చిక్కగా చేయచ్చు.  అదెలాగో ఇప్పుడు చూద్దాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేయించిన శనగపిండి...
Image Credit : AI

వేయించిన శనగపిండి...

పప్పు చాలా పలచగా అయినప్పుడు దానిని చిక్కగా మార్చడానికి శనగ పిండి బ్రహ్మాస్త్రంలా పని చేస్తుంది. ఒక చిన్న గిన్నెలో ఒక టీ స్పూన్ వేయించిన శనగ పిండిని తీసుకోవాలి.  పచ్చి పిండి కంటే వేయించిన శెనగ పిండి వాడితే.. పప్పు కి మంచి సువాసన వస్తుంది. రుచి కూడా పెరుగుతుంది. డైరెక్ట్ గా పప్పులో శనగ పిండి వేయడం కాకుండా…. దానిని చిన్న గిన్నెలో వేసి నీటితో కలపాలి. ఉండలు లేకుండా కలిపి.. ఆ తర్వాత  మరుగుతున్న పప్పులో వేసి.. బాగా కలపాలి. ఇలా చేస్తే నిమిషాల్లో పప్పు చిక్కగా మారుతుంది. రుచి కూడా రెట్టింపు అవుతుంది.

35
ఉడికించిన బంగాళాదుంప మ్యాజిక్
Image Credit : instagram

ఉడికించిన బంగాళాదుంప మ్యాజిక్

మీ దగ్గర ఉడికించిన బంగాళాదుంప ఉంటే, దాన్ని తీసుకుని బాగా మెత్తగా మెదపండి (మాష్ చేయండి). ఆ మెత్తటి బంగాళాదుంప మిశ్రమాన్ని పల్చగా ఉన్న పప్పులో వేసి బాగా కలపండి. ఇది పప్పుతో పూర్తిగా కలిసిపోయి దానికి 'క్రీమీ' టెక్స్‌చర్ ఇస్తుంది. దీనివల్ల పప్పుచారు చిక్కబడటమే కాకుండా, రుచి పెరిగి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

45
పప్పు గుత్తి లేదా గరిటె వాడకం
Image Credit : Getty

పప్పు గుత్తి లేదా గరిటె వాడకం

పప్పు సరిగ్గా ఉడకనప్పుడు లేదా నీళ్లు ఎక్కువైనప్పుడు మనం పాటించాల్సిన పాత, సులభమైన పద్ధతి ఇది. వంటగదిలో ఉండే పప్పు గుత్తి లేదా పెద్ద గరిటె తీసుకుని, గిన్నె అంచులకు పప్పును ఆనిస్తూ బాగా మెదపాలి. ఇలా చేయడం వల్ల పప్పు గింజలు మెత్తబడి వాటిలో ఉండే సహజమైన పిండి పదార్థం (స్టార్చ్) విడుదలవుతుంది. ఈ స్టార్చ్ నీటితో కలిసి పప్పుచారుకు మంచి చిక్కదనాన్ని ఇస్తుంది.

రెస్టారెంట్ లో వాడే పద్దతి…

సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో గ్రేవీలు చిక్కగా ఉండటానికి కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి) వాడతారు. ఒక టీస్పూన్ కార్న్ స్టార్చ్‌ను చల్లటి నీటిలో వేసి బాగా కరిగించాలి (వేడి నీటిలో వేస్తే ఉండలు కడుతుంది). ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పప్పుచారులో వేసి రెండు నిమిషాలు ఉడికించండి. వెంటనే మీ పప్పుచారుకు మెరుపు, క్రీమీ చిక్కదనం వస్తుంది.

55
తక్కువ మంట మీద మరిగించడం
Image Credit : Gemini AI

తక్కువ మంట మీద మరిగించడం

పైన చెప్పిన ఏ పదార్థాలూ అందుబాటులో లేనప్పుడు మీరు చేయగలిగే సులభమైన పని ఇది. కుక్కర్ మూత తీసి, మంటను తగ్గించి (సిమ్‌లో పెట్టి) పప్పుచారును 5 నుంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా మరగనివ్వండి. ఇలా చేయడం వల్ల పప్పులో ఉన్న అదనపు నీరు ఆవిరైపోయి, పప్పు చిక్కగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Recommended image2
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image3
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Related Stories
Recommended image1
Curry Leaves: ఎండాకాలం కరివేపాకు ఎండిపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటుంది..!
Recommended image2
Maggi Masala: పది నిమిషాల్లో ఇంట్లోనే మ్యాగీ మసాలా..ఎలా తయారు చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved