MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Food
  • Curry Leaves: ఎండాకాలం కరివేపాకు ఎండిపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటుంది..!

Curry Leaves: ఎండాకాలం కరివేపాకు ఎండిపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటుంది..!

Curry Leaves: బయట ఎండలకు కరివేపాకు తొందరగా ఎండిపోతోందా? దీని వల్ల వాటి రుచి తగ్గిపోతోందా? అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. కరివేపాకు నెల రోజులైనా తాజాగా ఉంచొచ్చు.  

2 Min read
Author : ramya Sridhar
Published : May 28 2026, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Curry Leaves
Image Credit : Getty

Curry Leaves

బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు ఎలాంటి కూరగాయలైనా తొందరగా ఎండిపోతాయి. ఇక..కరివేపాకు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా.. నాలుగు రోజులకే ఆకులన్నీ వడబడిపోతాయి. కరివేపాకు వంటకు కమ్మని వాసన తేవడమే కాదు.. మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అలాంటి కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.గాలి చొరబడని కంటైనర్, టిష్యూ పేపర్...
Image Credit : Getty

1.గాలి చొరబడని కంటైనర్, టిష్యూ పేపర్...

సహజంగానే ఎండాకాలంలో కరివేపాకు చాలా తొందరగా పాడైపోతుంది.తాజా ఆకులు కోసినా కూడా రెండు,మూడు రోజుల్లోనే ఆకులు వడబడుతూ ఉంటాయి. అందుకే..సరైన పద్దతిలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. మనం గాలి తగలని ఎయిర్ టైటనర్ కంటైనర్ లో స్టోర్ చేయాలి. ముందుగా, కాడల నుంచి ఆకులను వేరు చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత వాటిని టిష్యూ పేపర్ మీద ఆరబెట్టాలి. ఫ్యాన్ గాలి కింద ఆకులను ఆరపెట్టాలి. తరువాత.. ఒక ప్లాస్టిక్ లేదా గాజు లేదా గాలి చొరబడని పాత్రలో అడుగున టిష్యూ పేపర్ పరిచి.. దాని మీద కరివేపాకు ఆలకులు వేయాలి. పైన మరో టిష్యూ పేపర్ తో కప్పాలి. తర్వాత ఈ బాక్స్ ని ఫ్రిజ్ లో పెడితే చాలు... నెలరోజులు అయినా చాలా తాజాగా ఉంటాయి.

33
2. మస్లిన్ వస్త్రం
Image Credit : Getty

2. మస్లిన్ వస్త్రం

ఆకులను శుభ్రంగా కడిగి, ఆరబెట్టిన తర్వాత, వాటిని ఒక శుభ్రమైన, పలుచని కాటన్ క్లాత్ లేదా మస్లిన్ క్లాత్ లో వదులుగా కట్టండి. ఈ మూటను రిఫ్రిజిరేటర్‌లోని కూరగాయల అరలో పెట్టాలి. ఆ క్లాత్ ఆకులలోని అధిక తేమను పీల్చుకుని, ఆకులు పాడవ్వకుండా తాజాగా ఉంటాయి.

3. ఆకులను ఫ్రీజర్‌లో నిల్వ చేయండి.

మీరు కరివేపాకును ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే, ఎండిన ఆకులలోని గాలిని పూర్తిగా తీసివేసి, వాటిని ఒక జిప్-లాక్ బ్యాగ్‌లో వేసి నేరుగా ఫ్రీజర్‌లో పెట్టండి. వాటిని ఉపయోగించవలసి వచ్చినప్పుడు, గుప్పెడు కరివేపాకు తీసుకుని నేరుగా తాలింపులో కలపండి. ఇలా చేయడం వల్ల వాటి రుచి, సువాసన ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి.

4. నూనెలో వేయించండి

మీరు కరివేపాకును ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలనుకుంటే, దానిని నూనెలో వేయించి నిల్వ చేసుకోవచ్చు. ఇందుకోసం, ఒక బాణలిలో అర టీస్పూన్ నూనె వేడి చేసి, కరివేపాకును తక్కువ మంట మీద తేలికగా వేయించండి. చల్లారిన తర్వాత, వాటిని ఒక గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచండి. ఇలా కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు.

గమనిక...

అయితే.. కరివేపాకును నిల్వ చేయడానికి ముందు కొన్ని తప్పులు చేయకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాత... ఎండలో ఆరబెట్టకూడదు. ఎండలో ఆరబెడితే.. కరివేపాకు అసలైన సువాసన, రుచి తగ్గిపోతాయి. వాటిని ఎప్పుడూ ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Breakup Food: బ్రేకప్ తర్వాత ఐస్‌క్రీమ్‌నే ఎక్కువగా తింటారంట..ఎందుకో తెలుసా?
Recommended image2
Clean Greasy Non-Stick Pan: నాన్‌స్టిక్ పాన్ అంచులకు పట్టిన మొండి జిడ్డు పోవడం లేదా? ఇలా చేస్తే ఈజీగా క్లీన్
Recommended image3
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Curd: ఇడ్లీ, దోశ కాదు.. పరగడుపున పెరుగున్నం తింటే ఏమౌతుంది..?
Recommended image2
Kitchen Cooling: ఫ్యాన్, ఏసీ అక్కర్లేదు.. ఇవి ఉంటే కిచెన్ కూడా చల్లగా ఉంటుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved