MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఆడవాళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినాలి

ఆడవాళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినాలి

ఆడవారు పీరియడ్స్ నొప్పి, తిమ్మిరి, మెనోపాజ్, పీసీఓఎస్ వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటివల్ల వీరి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. శరీరం బలహీనపడుతుంది. అయితే వీరు కొన్నిసూపర్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
 

R Shivallela | Published : Oct 31 2023, 01:54 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

స్త్రీల శరీరం ఎన్నో మార్పులు చెందుతుంది. అలాగే వీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పి, తిమ్మరి, మూడ్ స్వింగ్స్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. మెనోపాజ్ లేదా పీసీఓఎస్ వల్ల ఈ సమస్యలు వస్తాయి. అందుకే ఆడవారు ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆడవాళ్లు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది వారి శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 

27
foods for skin

foods for skin

ఆడవారు తమ సమతుల్య ఆహారంలో భాగంగా కొన్ని సూపర్ ఫుడ్స్ ను చేర్చాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు వృద్ధాప్యం ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నివారించడానికి కూడా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి పీసీఓఎస్ తీవ్రమైన నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు డిప్రెషన్, స్థూలకాయం, మొటిమలు, జుట్టు రాలడం, మూడ్ స్వింగ్స్ వంటి ఎన్నో ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
pumpkin seeds

pumpkin seeds

గుమ్మడి గింజలు 

గుమ్మడి గింజలు ప్రోటీన్ కు మంచి వనరు. వీటిలో ఫైబర్, మొక్కల ఆధారిత ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వులు, రాగి, జింక్, ఇనుము, విటమిన్ ఎ, విటమిన్ బి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు ఆడవాళ్లకు చేసే మేలు ఎంతో.  దీనిలో పీఎంఎస్ ను అధిగమించడానికి అవసరమయ్యే మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం పీరియడ్ నొప్పి, కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని విటమిన్ బి6తో కలిపి వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.అలాగే కండరాలను సడలించి పీరియడ్స్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

47
Asianet Image

అవొకాడోలు 

మగవారి కంటే ఆడవారికే శరీర కొవ్వు ఎక్కువగా ఉంటుంది. జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది. దీనిలో స్త్రీ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అవొకాడోను రోజూ తీసుకోవడం వల్ల ఆడవారిలో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే మీ వెయిట్ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, హార్మోన్లను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అవొకాడోలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

57
Image: Getty Images

Image: Getty Images

ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు

బచ్చలికూర, కాలే వంటి ముదురు ఆకుకూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల పెరుగుదలకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి చాలా చాలా అవసరం. ఈ ఫోలెట్ కొత్త కణాలు  ఏర్పడటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గర్భిణులకు ఈ పోషకం చాలా ముఖ్యమైనది. కడుపులో బిడ్డ బాగా పెరిగేందుకు, వెన్నెముక, మెదడులో అభివృద్ధి చెందుతున్న న్యూరల్ ట్యూబ్లను రూపొందించడానికి ఫోలేట్ సహాయపడుతుంది. ఫోలేట్ స్థాయిలు తగ్గితే న్యూరల్ ట్యూబ్ లోపాలు, అకాల పుట్టుక వంటి ప్రమాదాలు పెరుగుతాయి. 
 

67
Asianet Image

సాల్మన్

సాల్మన్ ఫిష్ ఆడవారి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో విటమిన్ డి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ లో విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు చాలా చాలా అవసరం. పురుషులతో పోలిస్తే.. మహిళలకు వయస్సు-సంబంధిత ఎముక నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 50, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు వీరికి ఆస్టియోపెనియా వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంది. హార్ట్ హెల్తీ ఫిష్ మీరు బరువు తగ్గడానికి, మీ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. 

77
Asianet Image

బీన్స్

సోయాబీన్స్, పప్పుధాన్యాలు, శెనగపప్పుల్లో ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర శక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. బీన్స్, చిక్కుళ్లు వంటి ఇనుము ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తింటే శరీరంలో రక్తం కొరత ఉండదు. బలహీనత అనే సమస్యే ఉండదని నిపుణులు చెబుతున్నారు. 
 

 

R Shivallela
About the Author
R Shivallela
సౌందర్యం
ఆహారం
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories