Summer Drinks: వేసవిలో శరీర వేడిని తగ్గించే బెస్ట్ డ్రింక్స్ ఇవే..!
ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వేడిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి వాటర్ తో పాటు కొన్ని డ్రింక్స్ చాలా అవసరం. ఈ ఎండకాలంలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన నాచురల్ డ్రింక్స్ ఏంటో? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

మామిడి పండ్ల రసం
వేసవిలో విరివిగా లభించే మామిడి పండ్లలో ఎన్నో పోషక గుణాలున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మామిడి పండ్ల జ్యూస్ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. మామిడి పండులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మారేడు పండు రసం
మారేడు పండు రసం వేసవిలో శరీరానికి నీటి అవసరాన్ని తీరుస్తుంది. కడుపును చల్లగా ఉంచుతంది. శరీరంలోని వివిధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
చెరకు రసం
చెరకు రసాన్ని చాలామంది ఇష్టంగా తాగుతారు. చెరకు రసం వేసవిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులను తగ్గిస్తుంది.
లస్సీ
లస్సీ వేసవిలో దాహం తీర్చడానికి, శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది చల్లగా, రుచిగా ఉంటుంది.
పుచ్చకాయ జ్యూస్
పుచ్చకాయ జ్యూస్ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. విటమిన్ ఎ, సి లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లు వేసవిలో శరీరానికి చాలా మంచిది. విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు శక్తిని తిరిగి ఇవ్వడానికి కొబ్బరి నీళ్లు బాగా సహాయపడతాయి.
పెరుగు లస్సీ/జ్యూస్
పెరుగు లస్సీ/జ్యూస్ వేసవిలో కడుపును చల్లగా ఉంచుతుంది. మధ్యాహ్నం భోజనంలో లేదా సాయంత్రం స్నాక్స్‌లో తీసుకోవచ్చు.
నిమ్మరసం
నిమ్మరసం వేసవిలో చాలా అవసరం. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది.
సత్తు పిండి జ్యూస్
సత్తు పిండి జ్యూస్ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కడుపు నిండుగా ఉంటుంది. పోషకాలు శక్తిని పెంచుతాయి. కండరాల బలాన్ని మెరుగుపరుస్తాయి.
జీలకర్ర జ్యూస్
జీలకర్ర జ్యూస్ వేసవిలో జీర్ణక్రియను పెంచుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ సమస్య రాకుండా రక్షిస్తుంది.