Weight loss: మన ఇంట్లో దొరికే వీటిని తిన్నా ఈజీగా బరువు తగ్గొచ్చు..!
మన ఇంట్లో సింపుల్ గా లభించే కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us

Weight loss
బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గాలి అంటే.. మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి. అప్పుడప్పుడు ఏదైనా స్నాక్స్ తీసుకుంటే.. మళ్లీ బరువు పెరిగేస్తాం అని భయపడుతూ ఉంటారు. అందుకే, తమ క్రేవింగ్స్ ని కంట్రోల్ పెట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే.. మన ఇంట్లో సింపుల్ గా లభించే కొన్ని స్నాక్స్ తిన్నా కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు. అది కూడా ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండేవి. మరి, అవి ఏంటి? ఎలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండ్లు, పీనట్ బటర్..
అరటి పండు, పీనట్ బటర్.. ఈ రెండూ చాలా శక్తివంతమైన కాంబినేషన్ . పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు కండరాలు, నరాల పనితీరుకు మద్దతు ఇస్తాయి. పీనట్ బటర్ లో ఉండే ప్రోటీన్,ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ని కూడా అందిస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లు చేస్తుంది. అయితే, షుగర్, నూనె లు లేని పీనట్ బటర్ ఎంచుకోవడం ఉత్తమం.
డార్క్ చాక్లెట్ , బాదం
అవును, మీరు బరువు తగ్గడానికి హ్యాపీగా చాక్లెట్ తినవచ్చు. అది డార్క్ చాక్లెట్ మాత్రమే. కానీ అది కూడా మితంగానే తీసుకోవాలి. 70 నుండి 85% కోకో కలిగి ఉన్న డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి , కణాలను రక్షిస్తాయి. మరోవైపు, బాదంలో ఫైబర్ , గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.
ద్రాక్ష , వాల్‌నట్‌లు
ద్రాక్ష పండ్లు, వాల్ నట్స్ ని కూడా మనం హ్యాపీగా ఆస్వాదించొచ్చ. వాల్ నట్స్ చాలా క్రంచీగా ఉంటాయి. ఇక.. ఆంథోసైనిన్‌లను కలిగి ఉన్న ద్రాక్షతో జత చేసినప్పుడు ఇది మన జీవక్రియకు జోడిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ని చాలా ఈజీగా కరిగిస్తుంది. వాల్‌నట్‌లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆకలిని నియంత్రిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
బెర్రీలతో ఓట్ మీల్
బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్‌తో సమృద్ధిగా ఉన్న ఓట్ మీల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి , మిమ్మల్ని కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. రుచికి తియ్యగా ఉండటమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రోల్డ్ ఓట్స్ తీసుకుంటే.. చాలా ఈజీగా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.
చిక్ పీస్...
వేయించిన శెనగల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ శెనగలకు కూరగాయల ముక్కలు కూడా జత చేసి తీసుకుంటే.. కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా మనకు అందుతుంది. బరువు తగ్గేందుకుచాలా బాగా సహాయపడుతుంది.