MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Spinach: పాలకూర ఇలా పెడితే, 10 రోజులైనా తాజాగా ఉంటుంది..!

Spinach: పాలకూర ఇలా పెడితే, 10 రోజులైనా తాజాగా ఉంటుంది..!

Spinach:  ఫ్రిజ్ లో పెట్టినా కూడా  పాలకూర పాడైపోతుందా? ఆకులు చాలా త్వరగా పసుపు రంగులోకి మారిపోతున్నాయా? అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. పది రోజులు అయినా ఫ్రెష్ గా ఇప్పుడే కొన్నట్లు ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 14 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాలకూర ఎందుకు తినాలి..?
Image Credit : stockPhoto

పాలకూర ఎందుకు తినాలి..?

పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పాలకూరలో  చాలా పోషకాలు ఉంటాయి. వారానికి కనీసం రెండు సార్లు అయినా పాలకూర తినాలి. మనం రెగ్యులర్ గా పాలకూర తినడం వల్ల ఐరన్, ఫైబర్, విటమిన్ ఎ వంటి పోషకాలు లభిస్తాయి. 

మార్కెట్లో తాజాగా పాలకూర తెచ్చి ఫ్రిజ్ లో పెట్టినా కూడా రెండు రోజులకే పాడైపోతుంది. ఆకులు పసుపు రంగులోకి మారిపోతే..తినడానికి పనికి రాదు. అదే.. మీరు కొన్ని చిట్కాలు ఫాలో అయితే.. పది రోజులైనా పాలకూర తాజాగా ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తాజా పాలకూర కొనాలి...
Image Credit : AI

తాజా పాలకూర కొనాలి...

పాలకూర ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వడలిన ఆకులు ఉంటే కొనకూడదు. ముదురు ఆకుపచ్చ రంగులో.. మచ్చలు కూడా లేకుండా ఉన్న ఆకులను ఎంచుకోవాలి. అప్పటికే పసుపు రంగులోకి మారినా లేదా.. తడిగా ఉన్న ఆకులను పొరపాటున కూడా కొనకూడదు.

34
2. కడిగే తప్పు చేయొద్దు
Image Credit : Freepik

2. కడిగే తప్పు చేయొద్దు

చాలా మంది ఆకుకూరలను ఇంటికి తెచ్చిన వెంటనే కడిగి ఫ్రిజ్‌లో పెడతారు. ఇది చాలా పెద్ద తప్పు. ఆకులపై తేమ ఉంటే, బ్యాక్టీరియా త్వరగా పెరిగి ఆకుకూరలు కుళ్లిపోతాయి. కాబట్టి, పాలకూరను కడగకుండా నిల్వ చేయండి. వంట చేసే ముందు మాత్రమే శుభ్రంగా కడగాలి.

44
3. పేపర్ టవల్ లేదా కాటన్ క్లాత్ వాడకం
Image Credit : Freepik

3. పేపర్ టవల్ లేదా కాటన్ క్లాత్ వాడకం

పాలకూరను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి, దాన్ని పొడి పేపర్ టవల్‌లో లేదా కాటన్ క్లాత్‌లో చుట్టాలి. ఇది ఆకుల్లోని అదనపు తేమను పీల్చుకుంటుంది. ఆ తర్వాత, దాన్ని ఒక ఎయిర్-టైట్ డబ్బాలో లేదా జిప్-లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లోని వెజిటబుల్ డ్రాయర్‌లో ఉంచండి.

4. పాడైన ఆకులను వేరు చేయాలి 

పాలకూరను నిల్వ చేసే ముందు, కట్టలో కుళ్లిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను ఏరి పడేయండి. ఒక్క ఆకు పాడైనా, అది మొత్తం కట్టను త్వరగా పాడు చేస్తుంది.

5. పండ్లకు దూరంగా పెట్టాలి

 పాలకూరను యాపిల్స్, అరటిపండ్లు లేదా పియర్స్ వంటి పండ్ల దగ్గర పెట్టొద్దు. ఈ పండ్ల నుంచి విడుదలయ్యే 'ఇథిలీన్' వాయువు, ఆకుకూరలు త్వరగా వాడిపోయేలా చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fish Curry: చేపలపులుసులో ఇదొక్కటి వేయండి రుచి అదిరిపోతుంది
Recommended image2
Swiggy : స్విగ్గీ ఆర్డర్స్ లో మన హైదరబాదీ వంటకమే టాప్.. ఏదో తెలుసా?
Recommended image3
Protein Idli: ఈజీగా వెయిట్ లాస్‌ అవ్వాలంటే ఈ ప్రోటీన్ ఇడ్లీ ట్రై చేయండి..
Related Stories
Recommended image1
Cumin Water: పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే ఏమౌతుంది?
Recommended image2
Coriander: కొత్తిమీర ఆకులు తుంచి, కాడలు పారేస్తున్నారా? ఇక నుంచి ఇలా వాడేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved