టమాటాలను ఎక్కువగా తింటున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు తినరు
టమాటాలను మనం ప్రతి కూరలో వేస్తుంటాం. ఎందుకంటే వీటితో కూరలు గ్రేవీగా, టేస్టీగా అవుతాయి. కానీ వీటిని మరీ ఎక్కువగా తింటే మాత్రం కిడ్నీ స్టోన్స్, అలెర్జీ, చర్మం రంగు మారడం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

టమాటాలను ఎక్కువగా తినడం వల్ల వచ్చే సమస్యలు
ఆరోగ్యకరమైన కూరగాయల్లో టమాటాలు ఒకటి. టమాటాల్లో మన శరీరాన్ని హెల్తీగా ఉంచే ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటాం. అలాగని వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు టమాటాలను ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మూత్రపిండాల్లో రాళ్లు
అవును టమాటాలను ఎక్కువగా తినడం వల్ల మూత్రిపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే టమాటాల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు విచ్ఛిన్నం కావు. ముఖ్యంగా పొటిషియం, ఆక్సలేట్ లు. ఇవి టమాటాల్లో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే ఇవి జీర్ణం కాకుండా బయటకు వెళ్లవు. కాబట్టి ఈ ఖనిజాలు మన మూత్రపిండాల్లో పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి.
యాసిడ్ రిఫ్లెక్స్
టమాటాలను ఎక్కువ మొత్తంలో తింటే యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ సమస్య ఉన్నవారు టమాటాలను ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కీళ్ల నొప్పి
కీళ్ల నొప్పులు ఉన్నవారు టమాటాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కణజాలాల్లో కాల్షియం పేరుకుపోయే చేసి కీళ్ల వాపు, నొప్పికి దారితీస్తుంది. మీకు ఇది వరకే కీళ్ల నొప్పులు ఉంటే గనుక టమాటాలను ఎక్కువగా తినకండి.
చర్మం రంగు మారుతుంది
టమాటాల వల్ల ఎన్నో ఆరోగ్య, చర్మ ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదు. ఎందుకంటే టమాటాలను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో లైకోపీన్ పెరుగుతుంది. దీంతో లైకోపెనోడెర్మియా అనే సమస్య వస్తుంది. దీనివల్ల చర్మం రంగు మారుతుంది. అంటే నీరసంగా కనిపిస్తుంది.
అలెర్జీ
టమాటాల్లో హిస్టామిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది టమాటాలకు అలెర్జీని కలిగిస్తుంది. ఈ అలెర్జీ వల్ల దగ్గు, తుమ్ములు, దద్దుర్లు, గొంతులో దురద వంటి సమస్యలు వస్తాయి. టమాటాను తిన్న వెంటనే మీకు ఈ సమస్యలు గనుక వస్తే టమాటాలకు దూరంగా ఉండటమే మంచిది.