పచ్చి పాలను తేనెను ఇలా కలిపి పెడితే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది
Raw Milk and Honey Benefits: పచ్చిపాలలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పచ్చిపాలలో తేనెను కలిపి ముఖానికి పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చిపాలు, తేనె ఫేస్ ప్యాక్
ఆడవారు అందంగా కనిపించేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ ను కొంటుంటారు. ఇవి కేవలం ముఖాన్ని కొద్దిసేపటి వరకు మాత్రమే అందంగా కనిపించేలా చేస్తాయి. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో ముఖాన్ని లోపలి నుంచి అందంగా మెరిసేలా చేయొచ్చు.
నిపుణుల ప్రకారం.. పచ్చి పాలు, తేనెతో మనం ఎన్నో స్కిన్ బెనిఫిట్స్ ను పొందొచ్చు. ఈ రెండూ చర్మ సమస్యలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. పచ్చిపాలలో తేనె వేసి కలిపి ముఖానికి పెట్టడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చర్మం తేమగా ఉంటుంది
ఆయిలీ స్కిన్ ఉన్నవారి కంటే డ్రై స్కిన్ ఉన్నవారికి పచ్చిపాలలో తేనెను కలిపి పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి పెట్టడం వల్ల స్కిన్ తేమగా ఉంటుంది. ఇవి స్కిన్ చికాకు, దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇకపోతే తేనె చర్మంలో తేమను నిలుపుతుంది. పాలలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు చర్మం తేమను కోల్పోకుండా చేస్తుంది.
చర్మం శుభ్రం అవుతుంది
పచ్చిపాలలో తేనెను మిక్స్ చేసి ముఖానికి పెట్టడం వల్ల ముఖం క్లియర్ గా కనిపిస్తుంది. పచ్చి పాలు క్లెన్సర్ గా పనిచేసి ముఖం మీదున్న చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి. దీంతో మీ ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి
పచ్చి పాలు, తేనె రెండూ వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దీన్ని పెట్టడం వల్ల ముఖంమీదున్న ముడతలు, గీతలు, మచ్చలు వంటివి చాలా వరకు తగ్గుతాయి. పాలలోని ఎక్స్ ఫోలియేటింగ్ గుణాలు మన చర్మాన్ని స్మూత్ గా చేస్తాయి. తేనె చర్మాన్ని టైట్ గా చేస్తుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు. మీ చర్మం హెల్తీగా ఉంటుంది.
మచ్చలు తగ్గుతాయి
తేనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను, మచ్చలను, గాయాలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. తేనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మచ్చలను పోగొట్టి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. పచ్చిపాలు, తేనె మిశ్రమం నల్ల మచ్చలు, ట్యానింగ్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
పచ్చిపాలు, తేనె ప్యాక్ ను ఎలా తయారుచేయాలి?
ఇందుకోసం పచ్చిపాలను, తేనెను సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను రాత్రిపూట ముఖానికి రాసుకుని అర్థగంట తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.