చేపల వాసన పోవడానికి లవంగాలు, యాలకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం కొన్ని నీళ్లలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించండి. ఈ వాసన చేపల వాసనను పోగొడుతుంది.
Image credits: Getty
Telugu
వ్యర్థాలు
కిచెన్ లో చేపల వాసన రావడానికి దాని వ్యర్థాలు డ్రెయిన్ లో ఇరుక్కుపోవడం కూడా ఒక కారణం. అందుకే వ్యర్థాలను సపరేట్ గా పారేయడం మంచిది.
Image credits: Getty
Telugu
డ్రెయిన్ శుభ్రం చేయండి
చేపల వ్యర్థాలు డ్రెయిన్ లో ఉంటే బేకింగ్ సోడా, వెనిగర్ ను ఉపయోగించండి. వీటిని డ్రెయిన్ లో పోస్తే చేపల వాసన తొలగిపోతుంది.
Image credits: Getty
Telugu
శుభ్రం చేసేటప్పుడు
చేపలను శుభ్రం చేసిన చోట వాసన రావొద్దంటే ఆ ప్రదేశంలో కొంచెం బేకింగ్ సోడాను చల్లండి. దుర్వాసన పోతుంది.
Image credits: Getty
Telugu
వెనిగర్
వెనిగర్ తో కూడా చేపల వాసనను పోగొట్టొచ్చు. ఇందుకోసం 3 కప్పుల నీళ్లలో కప్పు వెనిగర్ ను వేసి 15 నిమిషాలు మరిగించండి. ఆవిరైన వెనిగర్ కిచెన్ లో దుర్వాసనను పోగొడుతుంది.
Image credits: Getty
Telugu
కాఫీ పొడి
కాఫీ పొడితో కూడా చేపల వాసన రాకుండా చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో కాఫీ పొడిని వేసి వంటింట్లో ఉంచండి. దీనిపై మూత పెట్టకండి.
Image credits: Getty
Telugu
తెరిచి ఉంచండి
చేపలను క్లీన్ చేసినా, వంట చేసినా కిటికీలను, తలుపులను తెరిచే ఉంచండి. ఇది చేపల వాసన వంటింట్లో ఎక్కువగా ఉండకుండా చేస్తుంది.