MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Recipe: గంగవల్లి కూర పప్పు ఇలా చేస్తే ఉంటది.. ప్లేటు కూడా నాకెయ్యాల్సిందే.

Recipe: గంగవల్లి కూర పప్పు ఇలా చేస్తే ఉంటది.. ప్లేటు కూడా నాకెయ్యాల్సిందే.

Recipe: గంగవల్లి ఆకుకూర అనేది మన పెరట్లో లేదా పొలాల్లో సహజంగా పెరిగే అద్భుతమైన ఆకుకూర. దీనిని 'పప్పు ఆకు' అని కూడా పిలుస్తారు. శరీరానికి చలవ చేయడంలో, పోషకాలను అందించడంలో ఇది మేటి. ఈ ఆకుతో ప‌ప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 01 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కావాల్సిన పదార్థాలు
Image Credit : shravani's kitchen/Youtube

కావాల్సిన పదార్థాలు

రుచికరమైన గంగవల్లి పప్పు తయారీకి ఈ క్రింది పదార్థాలు సిద్ధం చేసుకోండి:

* గంగవల్లి ఆకు: 4 చిన్న కట్టలు (శుభ్రం చేసి కట్ చేసినవి)

* కందిపప్పు: అర కప్పు (సుమారు 100-120 గ్రాములు)

* చింతపండు: చిన్న నిమ్మకాయ సైజంత

* కూరగాయలు: 1 ఉల్లిపాయ, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు

* మసాలాలు: కారం (1-2 స్పూన్లు), ధనియాల పొడి (1 స్పూన్), పసుపు, ఉప్పు

* పోపు కోసం: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె/నెయ్యి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పప్పును ఉడికించే విధానం
Image Credit : shravani's kitchen/Youtube

పప్పును ఉడికించే విధానం

ముందుగా కందిపప్పును రెండు మూడు సార్లు కడిగి, 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్‌లో ఒక కప్పు పప్పుకు మూడు కప్పుల నీళ్లు పోసి, కొద్దిగా పసుపు, నూనె, కరివేపాకు వేసి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో కావాలంటే మరికొన్ని నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి.

Related Articles

Related image1
Condoms: యుద్ధ స‌మ‌యంలో కండోమ్‌ల‌కు ఎందుకు డిమాండ్ పెరుగుతుంది.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Related image2
Projector: ఇంట్లో ఇది ఉంటే థియేట‌ర్‌కి వెళ్లాల్సిన ప‌నే ఉండ‌దు.. కేవ‌లం రూ. 5 వేల‌లోనే
35
పోపు, ఆకుకూర తయారీ
Image Credit : shravani's kitchen/Youtube

పోపు, ఆకుకూర తయారీ

ఒక కడాయిలో నూనె లేదా నెయ్యి వేడి చేసి, పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక టమాటా ముక్కలు వేసి అవి మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి, కట్ చేసిన గంగవల్లి ఆకును వేయాలి. ఈ ఆకు చాలా త్వరగా ఉడికిపోతుంది. ఆకు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని పోసి రెండు నిమిషాలు మరగనివ్వాలి.

45
చివ‌రిగా..
Image Credit : shravani's kitchen/Youtube

చివ‌రిగా..

చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు, ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును ఇందులో కలపాలి. పప్పు, ఆకుకూరతో పాటు మసాలాలన్నీ బాగా కలిసేలా మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఈ పప్పు రుచి అద్భుతంగా ఉంటుంది.

55
గంగవల్లి ఆకుకూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Image Credit : shravani's kitchen/Youtube

గంగవల్లి ఆకుకూరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఆకుకూర కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

శరీరానికి చలవ: గంగవల్లి ఆకులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: ఆకుకూరల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉండే అతికొద్ది మొక్కల్లో ఇది ఒకటి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జీర్ణక్రియ: ఇందులోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

విటమిన్లు & ఖనిజాలు: ఇందులో విటమిన్ A, Cతో పాటు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Related Stories
Recommended image1
Condoms: యుద్ధ స‌మ‌యంలో కండోమ్‌ల‌కు ఎందుకు డిమాండ్ పెరుగుతుంది.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Recommended image2
Projector: ఇంట్లో ఇది ఉంటే థియేట‌ర్‌కి వెళ్లాల్సిన ప‌నే ఉండ‌దు.. కేవ‌లం రూ. 5 వేల‌లోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved