Mutton: మటన్ ఎలా కొనాలో అర్థమవ్వడం లేదా.? ఏ పార్ట్ దేనికి బాగుంటుంది అంటే
Mutton: మటన్ వంటకాలకు మంచి రుచి రావాలంటే సరైన మాంసపు భాగం ఎంపిక చాలా ముఖ్యం. ప్రతి భాగానికి వేరు వేరు రుచి, టెక్స్చర్ ఉంటుంది. ఏ కట్‌తో ఏ వంట చేయాలో తెలుసుకుంటే కూర, కబాబ్, గ్రిల్ అన్నీ పర్ఫెక్ట్‌గా వస్తాయి.

కర్రీలు, స్లో కుకింగ్‌కు బెస్ట్ మటన్ భాగాలు
రాన్ (కాలు భాగం – వెనుక, ముందుభాగం) ఈ భాగంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా వండాలి. మటన్ కర్రీ, నిహారి, కోర్మా, రోస్ట్ వంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
దస్తీ (భుజం భాగం):
ఇది కొవ్వుతో కలిసిన మాంసం. కర్రీలు, హాండి వంటలకు చాలా బాగా సరిపోతుంది. రోగన్ జోష్, మటన్ హాండి వంటి వాటికి ఇది బాగా సెట్ అవుతుంది.
గ్రిల్, కబాబ్‌లకు బెస్ట్ మటన్ కట్స్:
పుత్ (లాయిన్, టెండర్‌లాయిన్) ఇది మటన్‌లో అత్యంత మృదువైన భాగం. త్వరగా ఉడుకుతుంది. సీక్ కబాబ్, తందూరి మటన్ వంటి వంటకాలకు ఉపయోగపడుతుంది.
చాంప్ (రెబ్బలు, చాప్స్):
కొద్దిగా కొవ్వు ఉండడం వల్ల గ్రిల్ చేసినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మటన్ చాప్స్ మసాలా, మొఘలాయి చాప్ వంటి వంటకాలకు ఇది పర్‌పెక్ట్‌గా చెప్పొచ్చు.
సూప్, గ్రేవీ గాఢత కోసం ఉపయోగించే భాగాలు:
పాయా (కాళ్ల చివరి భాగం) ఇందులో కొల్లాజన్ ఎక్కువగా ఉంటుంది. గ్రేవీకి మంచి గాఢత ఇస్తుంది. పాయా సూప్, పాయా కర్రీ వంటి వాటికి బెస్ట్.
సీనా (చెస్ట్, బ్రిస్కెట్ భాగం):
కొవ్వు ఎక్కువగా ఉండి రుచిగా ఉంటుంది. స్లో కుకింగ్ అవసరం. యఖ్ని, కాశ్మీరీ మటన్ కర్రీలకు ఈ మాంసం బెస్ట్ ఆప్షన్.
కీమా, స్టఫింగ్‌కు సరైన మటన్:
గలౌటి / కీమా (మిన్స్ చేసిన మాంసం) మెత్తగా ఉండే ఈ మాంసం త్వరగా ఉడుకుతుంది. గలౌటి కబాబ్, మటన్ కీమా పావ్, కట్‌లెట్లు వంటి వాటికి ఈ మాంసం బెస్ట్.

