- Home
- Life
- Food
- Dosa Batter Storage tips: ఫ్రిజ్ లేకపోయినా దోశ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
Dosa Batter Storage tips: ఫ్రిజ్ లేకపోయినా దోశ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా చేసే టిఫిన్ దోశ. చిన్నా, పెద్దా అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అయితే కొన్నిసార్లు దోశ బ్యాటర్ త్వరగా పుల్లబడుతుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా దోశ పిండిని ఎక్కువకాలం నిల్వ ఉంచవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

దోశ పిండి నిల్వచేసే చిట్కాలు
చాలామంది ఇష్టపడే టిఫిన్లలో దోశ ముందుంటుంది. దీన్ని ఫాస్ట్ గా చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఎక్కువమంది ఉదయాన్నే దోశ తినడానికి ఇష్టపడతారు. పైగా దోశ బ్యాటర్ ను ఒకసారి తయారుచేస్తే.. 2, 3 రకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు దోశ బ్యాటర్ త్వరగా పుల్లబడుతుంది. దానివల్ల టేస్ట్ కూడా మారిపోతుంది.
పిండి రుబ్బుతున్నప్పుడు..
దోశ బ్యాటర్ రుబ్బుతున్నప్పుడు, దాన్ని నిల్వ చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే వారం వరకు నిల్వ చేయవచ్చు. ఫ్రిజ్ లేకపోయినా 5 రోజుల వరకు దోశ పిండి పుల్లబడకుండా ఉంటుంది. దీంతో ఎప్పుడైనా వేడి వేడి మసాలా దోశ, సెట్ దోశ, ఊతప్పం చేసుకోవచ్చు. మరి దోశ పిండి నిల్వ ఉండడానికి పాటించాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దామా..
బియ్యం, పప్పు నానబెట్టినప్పుడు..
దోశ బ్యాటర్‌కి బియ్యం, మినపగుళ్లు నానబెట్టినప్పుడు మధ్యలో ఒకసారి నీరు మార్చాలి. బియ్యం, మినుములను కనీసం 8 నుంచి 9 గంటల పాటు నానబెట్టుకోవాలి. బ్యాటర్ రుబ్బుతున్నప్పుడు కూడా చల్లటి నీరు వాడకూడదు. బాగా మరిగించి చల్లార్చిన నీరు కలిపి రుబ్బడం వల్ల బ్యాటర్ త్వరగా పుల్లబడదు.
కొబ్బరి కలపకూడదు..
బ్యాటర్ రుబ్బుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి కలపకూడదు. కావాలంటే దోశ చేసుకునేటప్పుడు కొబ్బరి తురుము బాగా రుబ్బుకుని కలుపుకోవచ్చు. బియ్యం, మినప పప్పుతోపాటు నానబెట్టిన మెంతులు కలిపితే బ్యాటర్ మంచిగా ఉంటుంది. మెంతులు దోశ రుచిని మరింత పెంచుతాయి.
బేకింగ్ సోడా..
దోశ బ్యాటర్ రుబ్బిన వెంటనే ఉప్పు, బేకింగ్ సోడా కలపకూడదు. బేకింగ్ సోడా కలిపితే బ్యాటర్ ఉబ్బి పాడవుతుంది. దోశ వేసుకునేటప్పుడు బేకింగ్ సోడా కలుపుకోవచ్చు. దోశ బ్యాటర్‌లో పదే పదే చెంచా వేయకూడదు. ఎంత కావాలంటే అంత ఒక పాత్రలోకి తీసుకుని వాడుకోవాలి.
ఇంట్లో ఫ్రిజ్ లేకుంటే..
దోశ బ్యాటర్‌ను ఫ్రిజ్‌లో ఉంచి ఎక్కువకాలం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే వెడల్పాటి పాత్రలో నీరు పోసి.. దాంట్లో దోశ బ్యాటర్ పాత్ర ఉంచి ఒక వారం వరకు నిల్వ చేయవచ్చు. నీటిని రోజుకు రెండు నుంచి మూడు సార్లు మార్చాల్సి ఉంటుంది.
గాలి చొరబడకుండా..
దోశ బ్యాటర్ పాత్ర ఎప్పుడూ మూసి ఉండేలా చూసుకోవాలి. గాలి తగిలేలా తెరిచి ఉంచితే దోశ బ్యాటర్ త్వరగా పుల్లబడుతుంది. దోశ బ్యాటర్‌లో ఒకటి రెండు కరివేపాకులు వేసి కూడా నిల్వ చేసుకోవచ్చు.