ఏం చేస్తే అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి?
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. అయితే ప్రతి ఒక్కరూ డజన్ లేదా రెండు డజన్లను కొనేసి ఇంట్లో పెడుతుంటారు. కానీ ఈ పండ్లు చాలా తొందరగా కుళ్లిపోతాయి.

అరటిపండ్లు
అన్ని పండ్లలో రెగ్యులర్ గా, ఇష్టంగా తినే పండ్లు అరటిపండ్లు. నిజానికి ఈ పండ్లను పిల్లలు, పెద్దలు అంటూ ప్రతి ఒక్కరూ విసుక్కోకుండా తినేస్తుంటారు. అందులోనూ ఈ పండ్లు ఏడాది పొడవునా పండుతాయి. మార్కెట్ లో దొరుకుతాయి.
అందులోనూ ఈ పండ్లు చాలా చవక కూడా. ఎండాకాలమైనా, వానాకాలమైనా, చలికాలమైనా ఈ పండ్లను తింటారు. ఎందుకంటే ఈ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది ప్రతిరోజూ ఒక అరటిపండును తింటుంటారు.
అందుకే ఒకేసారి ఎక్కువ పండ్లను కొనేసి ఇంట్లో నిల్వ చేస్తుంటారు. కానీ ఈ పండ్లు చాలా తొందరగా కుళ్లిపోతుంటాయి. ఇంట్లో ఒకటి రెండు రోజులకు మించి ఫ్రెష్ గా ఉండవు. తొందరగా కుళ్లిపోతుంటాయి. కానీ కొన్ని చిట్కాలతో అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అరటిపండ్లు కుళ్లిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అరటిపండ్లు కుళ్లిపోకుండా ఉండేందుకు నిమ్మతొక్క బాగా సహాయపడుతుంది. నిమ్మతొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అరటిపండు కుళ్లిపోకుండా ఉండాలంటే నిమ్మతొక్కను ముందుగా నీళ్లలో వేయాలి.
ఇందులోనే అరటిపండ్లను కూడా వేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత బయలకు తీయండి. వీటిని గది ఉష్ణోగ్రత వద్దే ఉంచండి. ఇలా చేస్తే గనుక అరటిపండ్లు కుళ్లిపోకుండా తాజాగా ఉంటాయి. మీరు కావాలనుకుంటే విటమిన్ సి ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్ కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం వీటిని నీటిలో కరిగించి అందులోనే అరటిపండ్లను 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేసినా అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
అరటిపండ్లు
ప్లాస్టిక్ కవర్ తో కూడా మీరు అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేయొచ్చు. ఇందుకోసం మీరు అరటిపండ్లను ప్లాస్టిక్ కవర్ లో ఉంచొచ్చు. దీనివల్ల అరటిపండ్లు ఎక్కువ రోజులు కుళ్లిపోకుండా ఉంటాయి.
అరటిపండ్లు నిల్వ ఉండాలంటే ఇలా చేయకండి
చాలా మంది ఆడవారు అరటిపండ్లను ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. దీనివల్ల అవి కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని అనుకుంటారు. నిజానికి ఫ్రిజ్ లో పెడితేనే అరటిపండ్లు తొందరగా కుళ్లిపోతాయి.
ఫ్రిజ్ లో పెడితే అరటిపండ్లు తొందరగా మెత్తబడతాయి. మీరు అరటిపండ్లను నిల్వ చేయాలనుకుంటే టిష్యూ పేపర్ ను ఉపయోగించండి. అరటిపండ్లను టిష్యూ పేపర్ లో చుడితే పండ్లు తొందరగా కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.