Milk: పాలు ఫ్రిజ్ లో ఎన్ని రోజులు స్టోర్ చేయవచ్చు..?
Milk: పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.అందుకే, ప్రతిరోజూ పాలు తాగమని పెద్దలు చెబుతుంటారు. కానీ పాలను ఎన్నిరోజులు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు. నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...

Milk
చాలా మంది పాలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు.కానీ, పచ్చి పాలు ఫ్రిజ్ లో నిల్వ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్యాకెట్ పాలు లేదా మరిగించిన పాలతో పోలిస్తే.. పచ్చి పాలు త్వరగా పాడౌతాయి. సాధారణనంగా పచ్చి పాలను ఫ్రిజ్ లో 1 నుండి 2 రోజులు మాత్రమే నిల్వ చేయవచ్చు. ఫ్రీజర్ లో అంటే గడ్డ కట్టించి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. కానీ, రుచి తగ్గుతుంది.
పచ్చి పాలు నిల్వ చేయడానికి చిట్కాలు...
ఉష్ణోగ్రత.. పచ్చి పాలు పాడవ్వకుండా ఉండాలంటే ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేట్ లేదా అంతకంటే తక్కువ ఉండాలి. పాలను ఎప్పుడూ ఫ్రిజ్ తలుపులో ఉంచకూడదు.ఎందుకంటే ఫ్రిజ్ తలుపు తీసిన ప్రతిసారీ అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. పాలను ఎప్పుడూ ఫ్రిజ్ లోపల, వెనక భాగంలో ఉంచాలి. అంటే, ఎక్కువ చల్లదనం ఉన్న చోట మాత్రమే ఉంచాలి.
గాలి చొరబడని పాత్ర: పాలను మూత ఉన్న గాలి చొరబడని స్టీల్ లేదా గాజు పాత్రలో ఉంచడం వల్ల ఫ్రిజ్‌లోని ఇతర వాసనలు పాలకు అంటుకోవు.
పాలు పాడయ్యాయని గుర్తించేదేలా?
పచ్చి పాలు పాడైతే వాటిని ఈజీగా గుర్తించొచ్చు.
వాసన: పుల్లటి లేదా ఒక రకమైన వింత వాసన వస్తుంది.
రంగు: పాలు తెల్లగా కాకుండా స్వల్పంగా పసుపు రంగులోకి మారవచ్చు.
ముక్కలుగా అవ్వడం: పాలను మరిగించినప్పుడు అవి వెంటనే విరిగిపోయి ముక్కలుగా మారతాయి.
పచ్చి పాలను అలాగే నిల్వ చేయడం కంటే, తెచ్చిన వెంటనే ఒకసారి మరిగించి (Boiling) చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే పాలు 4 నుండి 5 రోజుల వరకు తాజాగా ఉంటాయి. పచ్చి పాలలో ఉండే బ్యాక్టీరియా వల్ల అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి వీలైనంత త్వరగా వాడేయడం మంచిది.

