MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Coconut Chutney: హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూరాల్సిందే

Coconut Chutney: హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూరాల్సిందే

Coconut Chutney: ఇడ్లీ, దోశె, పునుగులు, వడ..ఇలా దేనికైనా బెస్ట్ కాంబినేషన్ హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ. అదే చట్నీ ఇంట్లో ఇలా చేయండి, మీ ఫ్యామిలీ అంతా ఫిదా అయిపోతారు. గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందే. 

2 Min read
Author : Nandini Arava
Published : Apr 01 2026, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోటల్ స్టైల్‍ కొబ్బరి చట్నీలా రావడం లేదా?
Image Credit : pixabay

హోటల్ స్టైల్‍ కొబ్బరి చట్నీలా రావడం లేదా?

హోటల్‍కు వెళ్తే అక్కడ దొరికే కొబ్బరి చట్నీకి చాలా మందే అభిమానులు ఉంటారు. నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతుంది. కారంగా, పుల్లపుల్లగా, మృదువుగా, తెల్లగా ఉండి ....తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కొంతమంది టిఫిన్ కంటే చట్నీనే ఎక్కువగా తింటుంటారు. కానీ అదే స్టైల్ చట్నీ ఇంట్లో ఎందుకు రాదు, ఆరంగు కూడా రాదు? 

25
చట్నీ వెన్నలా మెత్తగా, మల్లెపువ్వులా తెల్లగా
Image Credit : Asianet News

చట్నీ వెన్నలా మెత్తగా, మల్లెపువ్వులా తెల్లగా

చాలామంది కొబ్బరి చట్నీ అంటే కేవలం కొబ్బరి, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టడమే అనుకుంటారు. చట్నీ వెన్నలా మెత్తగా, మల్లెపువ్వులా తెల్లగా.. అచ్చం హోటల్ రుచితో రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఇక మీదట మీ ఇంట్లో టిఫిన్ ఏదైనా సరే, ఈ కొబ్బరి చట్నీ ఉంటే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే. ఆ అదిరిపోయే రుచి వెనుక హోటల్ మాస్టర్లు వాడే 'సీక్రెట్ రెసిపీ' గురించి ఇక్కడ చూద్దాం. 

Related Articles

Related image1
Garlic chutney: కొలెస్ట్రాల్‌ను కరిగించే వెల్లుల్లి చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి, రెసిపీ ఇదిగో
Related image2
Moringa Chutney: మునగాకుతో చట్నీ ఇలా చేసుకొని తింటే, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి..!
35
హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ- కావలసిన పదార్థాలు
Image Credit : gemini ai

హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ- కావలసిన పదార్థాలు

పచ్చి కొబ్బరి: 1 కప్పు (కొబ్బరి వెనుక ఉన్న నలుపు తీసేయాలి)

పుట్నాల పప్పు లేదా వేపిన శనగపప్పు- 2 లేదా 3 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి: మీ కారానికి తగినట్లు

అల్లం: అర అంగుళం ముక్క

వెల్లుల్లి: 2 రెబ్బలు

చింతపండు: చిన్న చిన్న ముక్కలు

ఉప్పు: రుచికి సరిపడా

నీళ్లు: సరిపడా

45
తయారీ విధానం
Image Credit : gemini ai

తయారీ విధానం

మిక్సీ జార్‌లో కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టండి

మొదట నీళ్లు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టండి. ఆ తర్వాతే కొద్దికొద్దిగా చల్లని నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి.

చల్లని నీళ్లు వాడటం వల్ల కొబ్బరిలోని నూనె విడిపోకుండా చట్నీ తాజాగా ఉంటుంది. 

55
తాలింపు
Image Credit : gemini ai

తాలింపు

ఒక చిన్న పాన్‌లో 2 స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి చిటపటలాడించండి. పోపు వేగాక ఎండుమిర్చి, కరివేపాకు , చిటికెడు ఇంగువ వేయండి. హోటల్ చట్నీకి ఆ ప్రత్యేకమైన వాసన వచ్చేది ఈ ఇంగువ వల్లే. ఈ వేడి తాలింపును చట్నీలో వేసి బాగా కలపండి. అంతే టేస్ట్ అదిరిపోద్ది.

చట్నీ ఇంకాస్త రుచి రావాలంటే 3 సీక్రెట్ టిప్స్

చట్నీలో పుట్నాల పప్పు ఎక్కువైతే కొబ్బరి రుచి పోయి చట్నీ గట్టిగా అవుతుంది. కొబ్బరిలో నాలుగో వంతు మాత్రమే పప్పు ఉండాలి. చట్నీ మరింత కమ్మగా ఉండాలంటే గ్రైండ్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ గట్టి పెరుగు వేయండి. చట్నీ రంగు మారకుండా తెల్లగా ఉంటుంది. హోటల్స్‌లో కొన్నిసార్లు చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయను కూడా వేస్తారు, ఇది చట్నీకి ఒక రకమైన తియ్యటి రుచిని ఇస్తుంది. ఇలా ఓసారి ట్రై చేసి మీ బంధువులు, మీ ఫ్యామిలీకి పెట్టి చూడండి. ఒక్కసారి తిన్నారో...మీ చట్నీ కోసం క్యూ కట్టాల్సిందే. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Oil: వంటకు బెస్ట్ నూనె ఇదే
Recommended image2
Millet Idli: తెల్లటి ఇడ్లీ కాదు.. మిల్లెట్ ఇడ్లీ కూడా మెత్తగా రావాలా? ఈ చిన్న చిట్కా వాడితే చాలు
Recommended image3
Recipe: గంగవల్లి కూర పప్పు ఇలా చేస్తే ఉంటది.. ప్లేటు కూడా నాకెయ్యాల్సిందే.
Related Stories
Recommended image1
Garlic chutney: కొలెస్ట్రాల్‌ను కరిగించే వెల్లుల్లి చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి, రెసిపీ ఇదిగో
Recommended image2
Moringa Chutney: మునగాకుతో చట్నీ ఇలా చేసుకొని తింటే, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved