MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Traditional Andhra Recipe: వేసవి వేడి తగ్గించే అమ్మమ్మల నాటి తరవాని చారు

Traditional Andhra Recipe: వేసవి వేడి తగ్గించే అమ్మమ్మల నాటి తరవాని చారు

Traditional Andhra Recipe: తరవాని చారు (ట్రెడిషనల్ గంజి రసం) పాతకాలం నుంచి ఇంటింటా చేసుకునే ఒక సంప్రదాయ వంటకం. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా చేస్తారు. ఇది వేసవిలో శరీరానికి కూలింగ్ ఇస్తుంది. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 04 2026, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫెర్మెంటేషన్...చారుకు అసలు రుచి
Image Credit : Getty

ఫెర్మెంటేషన్...చారుకు అసలు రుచి

తరవాని చారు అంటే చాలా మందికి గుర్తొచ్చేది పుల్లగా ఉండే ఆ ప్రత్యేక రుచి. ఇది సాధారణంగా తాజా గంజితో కాకుండా, ఒక రాత్రి లేదా రెండు రోజులు నిల్వచేసిన గంజితో తయారు చేస్తారు. నిల్వచేసిన గంజి సహజంగా ఫెర్మెంట్ అవుతూ కొద్దిగా పుల్ల రుచిని ఇస్తుంది. అదే ఈ చారుకు అసలు ప్రత్యేకత. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గంజిని వృథా చేయకుండా ప్రత్యమ్నాయం
Image Credit : Getty

గంజిని వృథా చేయకుండా ప్రత్యమ్నాయం

మన పెద్దలు అన్నం వడకట్టిన తర్వాత మిగిలే గంజిని ఎప్పుడూ వృథా చేయరు. దానిని ఒక మట్టి పాత్రలో లేదా స్టీల్ పాత్రలో పోసి మూతపెట్టి ఉంచేవారు. గాలి ద్వారా సహజమైన బ్యాక్టీరియా అందులో పెరిగి ఫెర్మెంటేషన్ చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల గంజి పుల్లగా మారుతుంది. ఈ పుల్లదనం వంటకానికి మంచి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది.

Related Articles

Related image1
Health: గుండె ఆరోగ్యానికి మంచిద‌ని వైన్ తెగ తాగేస్తున్నారా.. ఏమ‌వుతుందో తెలుసా.?
Related image2
Summer Health Tips: ఈ సమ్మర్ లో బెస్ట్ హెల్త్ టిప్స్ తో బయటపడొచ్చు...
35
ఆరోగ్య లాభాలు
Image Credit : Getty

ఆరోగ్య లాభాలు

పుల్ల గంజి అంటే సహజ ప్రోబయోటిక్ లాంటిదే. ఇది గట్ హెల్త్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ బాగోలేని వారికి ఇది ఎంతో ఉపయోగకరం. వేసవికాలంలో శరీరానికి చల్లదనం ఇస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది కాబట్టి చిన్న పిల్లలు, వృద్ధులు కూడా తీసుకోవచ్చు. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల సమయంలో ఇది మంచి ఎంపిక.

45
తరవాని చారు తయారీ విధానం
Image Credit : Getty

తరవాని చారు తయారీ విధానం

ముందుగా ఒక రోజు లేదా రెండు రోజుల పాటు నిల్వచేసిన పుల్ల గంజిని తీసుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి తేలికగా వేపాలి. కావాలంటే చిన్న టమోటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో పుల్ల గంజి పోసి ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి లేదా కారం వేయాలి. కొన్ని నిమిషాలు మరిగించి చివరగా కొత్తిమీర చల్లి దించాలి.

55
దుర్వాసన వస్తే వాడకండి
Image Credit : our own

దుర్వాసన వస్తే వాడకండి

కొంతమంది ఇందులో మజ్జిగ లేదా పెరుగు కొద్దిగా కలిపి తాగుతారు. మరికొందరు వెల్లుల్లి ఎక్కువగా వేసి స్పైసీగా చేస్తారు. ఇంటి రుచికి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఇది చారులాగా కాకుండా సమ్మర్ డ్రింక్ లాగా కూడా తాగొచ్చు. పుల్లటి గంజిలో పైన నీటిని తీసుకుని కాస్త ఉప్పు కలిపి తాగితే...శరీరంలో వేడి ఇట్టే దిగిపోద్ది.

గంజి ఎక్కువ రోజులు ఉంచి దుర్వాసన వస్తే వాడకండి. వేసవిలో అయితే ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. ఫెర్మెంటేషన్ సహజంగా జరగాలి కానీ పాడైపోకుండా చూసుకోవాలి.

తరవాని చారు కేవలం ఒక ఫుడ్ మాత్రమే కాదు, ఆహారం వృథా కాకుండా వినియోగించే సంస్కృతికి నిదర్శనం. సాదాసీదా గంజి నుంచి ఇలా రుచికరమైన, ఆరోగ్యకరమైన చారు తయారు అవుతుంది. ఇంట్లో ఒకసారి పుల్ల గంజితో తరవాని చారు చేసి చూడండి. రుచి కూడా, ఆరోగ్యం కూడా రెండూ మీవే.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Health: గుండె ఆరోగ్యానికి మంచిద‌ని వైన్ తెగ తాగేస్తున్నారా.. ఏమ‌వుతుందో తెలుసా.?
Recommended image2
Summer Health Tips: ఈ సమ్మర్ లో బెస్ట్ హెల్త్ టిప్స్ తో బయటపడొచ్చు...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved