Fenugreek Leaves: మెంతాకులు సంవత్సరం పొడువునా ఎలా స్టోర్ చేయాలో తెలుసా
food-life Mar 04 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
పేపర్ టవల్ లో చుట్టి పెట్టుకోవాలి..
వారం రోజుల్లో మెంతి ఆకును వాడుకోవాలి అనుకుంటే, దాన్ని కడగకుండా పేపర్ టవల్ లో చుట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. వారం రోజులైనా ఆకులు తాజాగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
మెంతి ఆకును ఫ్రీజ్ చేయండి
మెంతి ఆకును శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా పూర్తిగా తుడవండి. తర్వాత దాన్ని చిన్నగా తరిగి, జిప్ లాక్ బ్యాగుల్లో లేదా ఐస్ ట్రేలలో నింపి ఫ్రీజర్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
ఎండలో ఆరబెట్టుకోవచ్చు
మెంతి ఆకు సువాసన ఎక్కువ కాలం ఉండాలంటే, ఆకుల్ని కడిగి, ఆరబెట్టాలి. తర్వాత 2-3 రోజులు ఎండలో బాగా ఎండనివ్వాలి. దీన్ని పొడి చేసి గాలి చొరబడని డబ్బాలో పెడితే ఏడాది పొడవునా వాడుకోవచ్చు.
Image credits: Getty
Telugu
మెంతి ఆకు పేస్ట్ క్యూబ్స్
కడిగి ఆరబెట్టిన మెంతి ఆకులో కొద్దిగా నూనె, నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను ఐస్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేయండి.
Image credits: Getty
Telugu
వేయించి పొడి చేసుకోవచ్చు
ఎండలో ఆరబెట్టిన మెంతి ఆకులను ఒక పాన్‌లో వేసి 1-2 నిమిషాలు చిన్న మంటపై వేయించండి. తర్వాత, కాస్త బరకగా పొడి చేసి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవచ్చు.