MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • ఈ దీపావళికి జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామూన్ ను ఇలా పర్ఫెక్ట్ గా చేయండి

ఈ దీపావళికి జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామూన్ ను ఇలా పర్ఫెక్ట్ గా చేయండి

Diwali 2025: దీపావళి స్పెషల్ అంటే స్వీట్సే. కాబట్టి ప్రతి ఇంట్లో రకరకాల స్వీట్లను నోరూరిస్తుంటాయి. ముఖ్యంగా చాలా మంది దీపావళికి గులాబ్ జామూన్ ను చేస్తుంటారు. కానీ ఇవి జ్యూసీగా అస్సలు రావు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 16 2025, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దీపావళి స్వీట్స్
Image Credit : Freepik

దీపావళి స్వీట్స్

దీపావళి పండుగకు తీపి పదార్థాలే స్పెషల్. అందుకే చాలా మంది దీపావళి పండుగకు రకరకాల స్వీట్లను కొంటుంటారు. కొంతమంది ఇంట్లోనే స్వీట్లను తయారుచేస్తుంటారు. చాలా మందికి ఇష్టమైన స్వీట్లలో గులాబ్ జామూన్ ఒకటి. అయితే కొంతమంది వీటిని పర్ఫెక్ట్ గా చేస్తే.. మరికొంతమందికి వీటిని చేయడం అస్సలు రాదు. 

ఒకవేళ చేసినా సరిగ్గా రావు. అందుకే గులాబ్ జామూన్ లను కూడా షాప్ లో కొనేస్తుంటారు. కానీ మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయితే పర్ఫెక్ట్ గులాబ్ జామూన్ లను తయారుచేస్తారు. అది కూడా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామూన్ లను. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ గా, తొందరగా వీటిని తయారుచేయొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గులాబ్ జామూన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
Image Credit : our own

గులాబ్ జామూన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

పర్ఫెక్ట్ గులాబ్ జామూన్ ను తయారుచేయడానికి 200 గ్రాముల గులాబ్ జామున్ మిక్స్, టీ స్పూన్ నెయ్యి, అవసరమైనన్ని పాలను పక్కన పెట్టుకోవాలి.ఇకపోతే సిరప్ కోసం రెండు కప్పుల చక్కెర, నాలుగైదు యాలకులు, 1.5 కప్పుల నీళ్లు, కొంచెం కుంకుమ పువ్వు అవసరమవుతాయి. వేయించడానికి నెయ్యి లేదా నూనె అవసరం.

35
గులాబ్ జామూన్ తయారీ విధానం
Image Credit : pixabay.com

గులాబ్ జామూన్ తయారీ విధానం

ముందుగా గులాబ్ జామూన్ మిక్స్ ను ఒక పెద్దగిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో నెయ్యి లేదా నూనె వేసి కలపాలి. ఆ తర్వాత అవసరానికి తగ్గట్టు పాలను కొంచెం కొంచెం పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. 

కానీ పిండిని మరీ మెత్తగా కలపకూడదు. కొంచెం గట్టిగానే ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే వీటిని నూనెలో వేసినప్పుడు పగిలిపోతాయి. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల గులాబ్ జామూన్ లు చాలా సాఫ్ట్ గా వస్తాయి.

45
గులాబ్ జామూన్ సిరప్ తయారీ విధానం
Image Credit : pixabay.com

గులాబ్ జామూన్ సిరప్ తయారీ విధానం

ఇప్పుడు స్టవ్ పై ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో నీళ్లు, చక్కెర, యాలకుల పొడిని వేయండి. ఇందులో కావాలనుకుంటే మీరు కొన్ని కుంకుమ పువ్వు దారాలను కూడా వేయొచ్చు. దీనివల్ల సిరప్ మంచి రంగులో వస్తుంది. అలాగే మంచి వాసన కూడా వస్తుంది. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీదే మరిగించాలి. 

చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మంటను తగ్గించి మరో ఐదు పది నిమిషాలు మరగనివ్వాలి. ఇది కొంచెం జిగటగా అయితే స్టవ్ ను ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి.

55
పర్ఫెక్ట్ గులాబ్ జామూన్ రెడీ
Image Credit : pixabay.com

పర్ఫెక్ట్ గులాబ్ జామూన్ రెడీ

ఆ తర్వాత పక్కన పెట్టిన పిండిని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేయండి. అయితే ఇవి చాలా సాఫ్ట్ గా ఉండాలి. వీటిపైన క్రాక్స్ అస్సలు ఉండకూడదు. లేదంటే అవి నూనెలో వేసినప్పుడు పగిలిపోతాయి. అయితే మీరు పిండి బాల్స్ చేసేటప్పుడు పిండిని బాగా ప్రెస్ చేస్తే క్రాక్స్ రాకుండా ఉంటాయి.

 ఇప్పుడు వీటిని వేడిగా అయిన నూనెలో వేయండి. అయితే నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. మీడియం, తక్కువ మంట మీదే వీటిని ఫ్రై చేయాలి. లేదంటే గులాబ్ జామూన్ లు లోపల పిండిగా ఉంటాయి.

గులాబ్ జామూన్ లను బంగారు, గోధుమ రంగు వచ్చే వరకు తక్కువ నుంచి మీడియం మంట మీదే ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయించేటప్పుడు అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. అప్పుడే అవి అన్నివైపులా బాగా ఫ్రై అవుతాయి. లోపల బాగా ఉడుకుతాయి. ఫ్రై చేసుకున్న గులాబ్ జామూన్ లను వేడి సిరప్ లో వేయండి. 

వీటిని రెండు మూడు గంటల పాటు సిరప్ లో ఉంచండి. అప్పుడే ఈ బాల్స్ సిరప్ ను బాగా గ్రహిస్తాయి. అప్పుడే గులాబ్ జామూన్ లు జ్యూసీ జ్యూసీగా అవుతాయి. ఈ గులాబ్ జామూన్ లు సిరప్ ను పూర్తిగా పీల్చుకున్న తర్వాత వాటిని సర్వింగ్ గిన్నెలోకి మార్చండి. వీటిని తరిగిన బాదం లేదా పిస్తాతో డెకరేట్ చేసి తింటే టేస్టీ అదిరిపోతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
వైట్ ఎగ్స్ vs బ్రౌన్ ఎగ్స్.. రెండింటిలో ఇది తింటేనే మంచిది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved