Clay pot cookingమట్టి పాత్రల్లో వంట: ఇలా చేస్తే డేంజర్!
లోహ పాత్రలతో పోలిస్తే మట్టి కుండల్లో వంట చేసుకోవడం ఎంతోమంచిది అని చెబుతుంటారు. అయితే వీటికీ కొన్ని పద్ధతులు ఉంటాయి. వంట సరే.. వాటిని శుభ్రం చేయడం, ఇతర వాటితో కలిపి వండటం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

ఆరోగ్యకరం
మన తాతలు, నానమ్మలు ఆరోగ్యంగా ఉండటానికి వారి ఆహారపు అలవాట్లే కాదు, వంట చేసే విధానం కూడా కారణం. అవును, వాళ్ళు మట్టి కుండలో వంట చేసి తినేవాళ్ళు. కానీ, కాలం మారిన తర్వాత మట్టి కుండలో వంట చేయడం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ మట్టి కుండలో వంట చేయడం పెరుగుతోంది. మట్టి కుండలో వంట చేసి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, మట్టి కుండలో వంట చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేదంటే అది పగిలిపోతుంది. మట్టి కుండలో వంట చేసేటప్పుడు దాన్ని ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మట్టి పాత్రలను వేరుగా పెట్టండి!
మీరు వాడే మట్టి కుండలు, పాత్రలు వేరే పాత్రలతో కలిపి పెట్టకుండా వేరుగా పెట్టాలి. లేదంటే అవి తొందరగా విరిగిపోతాయి లేదా పగుళ్ళు వస్తాయి. మట్టి కుండల కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయండి. ముఖ్యంగా మట్టి కుండలను ఒకదాని మీద ఒకటి పెట్టకండి.
చెక్క గరిటెలు వాడండి:
మట్టి పాత్రల్లో వంట చేసేటప్పుడు ఇనుప గరిటెలు అస్సలు వాడకూడదు. అవి మట్టి పాత్ర లోపలి భాగాన్ని పాడు చేస్తాయి. అంటే గీతలు పడేలా చేస్తాయి. వాటికి బదులుగా చెక్క గరిటెలు వాడటం మంచిది.
సబ్బు వాడవద్దు
మట్టి పాత్రలను శుభ్రం చేసేటప్పుడు సబ్బు, ఇనుప స్క్రబ్బర్ వాడకూడదు. సబ్బు వేసి కడిగితే ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. బదులుగా బేకింగ్ సోడా, ఉప్పు, కొబ్బరి పీచుతో శుభ్రం చేయవచ్చు.
పొడిగా ఉండే చోట పెట్టండి!
మట్టి కుండను శుభ్రం చేసిన తర్వాత దాన్ని ఆరబెట్టడానికి సరైన చోట పెట్టాలి. ఎటువంటి తేమ లేని చోట ఆరబెట్టాలి. లేదంటే పాత్ర పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి మట్టి పాత్రను బాగా ఆరిన చోట పెట్టండి.
సిట్రిక్ ఆహారాలు వండకండి!
మట్టి కుండల్లో సిట్రిక్ ఆహారాలు వండటం మానుకోవాలి. ఎందుకంటే సిట్రిక్ ఆమ్లం మట్టితో కలిసి, వండే ఆహారం రుచిని మారుస్తుంది.
తక్కువ మంట మీద వండండి!
వేరే వంట పాత్రల్లా కాకుండా మట్టి పాత్రలను తక్కువ మంట మీద వండాలి. ఎక్కువ మంట మీద అస్సలు వండకూడదు. తక్కువ మంట మీద వండేటప్పుడు వంట నెమ్మదిగా అవుతుంది, ఆహారానికి మంచి రుచి వస్తుంది.