Kitchen Hacks: ఇలా చేస్తే బెండకాయ కూర జిగటగా కాదు
Kitchen Hacks: కొంతమంది బెండకాయ కూరను టేస్టీగా, జిగటగా లేకుండా చేస్తారు. కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా కూర జిగటగానే అవుతుంది. ఇలా కాకూడదంటే ఏం చేయాలో తెలుసా?

బెండకాయ
కూరగాయల్లో ఒకటైన బెండకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, బయోటిన్ వంటి ఎన్నో రకా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ షుగర్ ను నియత్రించడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగపర్చడం నుంచి ఎముకలను బలంగా ఉంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న బెండకాయ కూరను చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ కూర జిగటగా అవుతుంది. దీనికి కారణం ఈ కూరగాయలో ఉండే మ్యూసిలేజ్ అనే పదార్థం. దీనివల్ల బెండకాయ జిగటగా అవుతుంది. దీనివల్లే చాలా మంది బెండకాయ కూర అంటే మొహం చాటేస్తారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో బెండకాయ కూర జిగటగా కాకుండా టేస్టీగా, క్రిస్పీగా అయ్యేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందే కడగాలి
బెండకాయల్ని కట్ చేయడానికి ముందే వీటిని శుభ్రంగా కడగాలి. ఆ వెంటనే బెండకాయల్ని కట్ చేయకూడదు. వీటిని పూర్తిగా ఆరనిచ్చిన తర్వాతే కట్ చేయాలి. టిష్యూ పేపర్ తో తుడిస్తే బెండకాయలకు తడి ఉండదు. ఇలా గనుక చేస్తే బెండకాయ ఎక్కువ జిగటగా కాదు.
పెరుగు
బెండకాయ కూర జిగటగా కాకుండా ఉండటానికి మీరు పెరుగును కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం బెండకాయలను వేయించేటప్పుడు జిగటగా అవుతుంటే అందులో టీ స్పూన్ పెరుగును వేసి కలపండి. దీనివల్ల బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కావాలనుకుంటే మీరు నిమ్మరసాన్ని కూడా పిండొచ్చు. నిమ్మరసం పిండినా కూడా బెండకాయ జిగురు పోతుంది. లేదా చింతపండు రసాన్ని కూడా కూరను దించేముందు వేసుకున్నా జిగట పోతుంది.
చిన్నగా కట్ చేయకూడదు
చాలా మంది బెండకాయల్ని చాలా చిన్న చిన్నముక్కలుగా కట్ చేస్తుంటారు. కానీ బెండకాయల్ని మరీ చిన్నగా కట్ చేస్తే కూడా జిగురు ఎక్కువగా వస్తుంది. కాబట్టి బెండకాయల్ని వీలైనంత పొడుగ్గా కట్ చేయండి. మీరు ఒక బెండకాయను మూడు ముక్కలుగా కట్ చేసినా పర్లేదు. దీనివల్ల జిగురు తక్కువగా ఉంటుంది.
శెనగపిండి
బెండకాయ కూరలో శెనగపిండిని వేసినా కూడా కూర జిగటగా కాదు. దీనివల్ల బెండకాయ కూర టేస్ట్ అస్సలు మారదు. కాగా టేస్ట్ మరింత బాగుంటుంది. ఇందుకోసం శెనగపిండిని బెండకాయలను వేయించేటప్పుడే వేయాలి.
బాగా వేయించాలి
బెండకాయల్ని సరిగ్గా వేయించకపోతే కూడా కూర జిగటగా అవుతుంది. కాబట్టి మీరు వాటిని బాగా వేయించండి. దీనివల్ల బెండకాయ కూర జిగట లేకుండా అవుతుంది. అలాగే బెండకాయల్ని వేయించేటప్పుడే ఉప్పును వేయకండి. బెండకాయల్ని ఎనిమిదిపది నిమిషాలు వేయించి ఇతర పదార్థాలు వేసుకుంటే కూర జిగురు లేకుండా టేస్టీగా అవుతుంది.