సీజన్ ముగిసేలాగా..ఒక్కసారైనా రుచి చూడాల్సిన మ్యాంగో మసాలా రైస్..!
ఒక్కసారి ఈ మ్యాంగో మసాలా రైస్ తిన్నారంటే.. జీవితంలో ఆ రుచిని మర్చిపోలేరు. ఈ మ్యాంగో సీజన్ ముగిసేలోగా ఒక్కసారైనా కచ్చితంగా రుచి చూడాల్సిన.. ఈ రైస్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం...
mango rice
సమ్మర్ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లే. మామిడి పండ్లను లేకుండా.. మనం సమ్మర్ ని ఊహించలేం. అయితే.. ఇప్పటి వరకు వరకు మీరు పండిన మామిడి పండ్లను తిని ఉంటారు. పచ్చి మామిడికాయలతో కూడా పప్పు, పచ్చళ్లు, పులిహోర కూడా చేసుకొని ఉంటారు. కానీ... పచ్చి మామిడి కాయతో ఎప్పుడైనా కమ్మని మసాలా రైస్ ఎప్పుడైనా తిన్నారా..? ఒక్కసారి ఈ మ్యాంగో మసాలా రైస్ తిన్నారంటే.. జీవితంలో ఆ రుచిని మర్చిపోలేరు. ఈ మ్యాంగో సీజన్ ముగిసేలోగా ఒక్కసారైనా కచ్చితంగా రుచి చూడాల్సిన.. ఈ రైస్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం...
mango rice
మసాలా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
1.తురిమిన పచ్చి మామిడికాయ
ఉడికించి పెట్టుకున్న అన్నం.
పోపు దినుసులు( ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎర్ర మిరపకాయలు, శెనగ పప్పు, కరివేపాకు)
రుచికి సరపడా ఉప్పు..
mango rice
ఈ మసాలా రైస్ తయారీ విధానం చూద్దాం..
ముందుగా.. అన్నాన్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. ఆ తర్వాత.. ఒక ప్యాన్ తీసుకొని.. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొత్తిమీర, 8 నుంచి 10 ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. వీటిని బాగా వేయించిన తర్వాత... వీటిని... బ్లెండర్ లో వేసి మంచిగా పొడి చేసుకోవాలి.
mango rice
ఇప్పుడు.. మరో ప్యాన్ ఫెట్టుకొని.. అందులో సరిపడ నూనె కానీ నెయ్యి కానీ వేయాలి. నూనె కాగిన తర్వాత.. దానికి 1 టేబుల్ స్పూన్ చనా పప్పు, 1 టేబుల్ స్పూన్ ఉరద్ పప్పు, ఆవాలు, కరివేపాకు జోడించండి. ఇవి వేగిన తర్వాత.. ముందుగా పొడి చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇది కూడా కాస్త వేగిన తర్వాత.. ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా వేయాలి. దీనిని మంచిగా వేయించుకున్న తర్వాత రుచికి సరపడా ఉప్పు వేసి... తర్వాత.... ఉడికించి ఆరబెట్టుకున్న అన్నం వేయాలి. దానిని మంచిగా కలుపితే సరిపోతుంది. అంతే... కమ్మని.. మ్యాంగో మసాలా రైస్ రెడీ అయినట్లే. నోట్లో పెట్టుకుంటే.. ఆ రుచికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.
ఇంతలో, పచ్చి మామిడి పండ్లలో తీపి పండిన మామిడి కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మీ కడుపు సమస్యలన్నింటికీ అద్భుతాలు చేస్తాయి. విటమిన్ సి ఐరన్ ని గ్రహించడంలో సహాయపడుతుంది. అందువల్ల, రక్తహీనతతో బాధపడేవారికి పచ్చి మామిడిని సిఫార్సు చేస్తారు. పచ్చి మామిడి పండ్లలో పెక్టిన్ కూడా ఉంటుంది, ఇది యాపిల్స్, బెర్రీలు వంటి ఇతర పండ్లలో ఉంటుంది, ఇది మీ హృదయానికి మేలు చేస్తుంది.