10 నిమిషాల్లో ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేయాలో తెలుసా?
ఇంట్లో నెయ్యి తయారు చేయడం చాలా సులభం అని మీకు తెలుసా? ఓ మహిళ మాత్రం ఇలా పది నిమిషాల్లో నెయ్యి చేసేసింది. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నెయ్యిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. మితంగా తింటే.. దీని వల్ల మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే.. దాదాపు చాలా మంది నెయ్యిని రెగ్యులర్ గా తమ డైట్ లో భాగం చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ.. ఈ రోజుల్లో ఎవరూ ఇంట్లో నెయ్యి చేయడం మానేస్తున్నారు. ఎక్కువగా బయటే కొనేస్తున్నారు. ఎందుకు అంటే.. నెయ్యి చేయడం అంత సులువు కాదు. చాలా సేపు.. స్టవ్ దగ్గర నిల్చొని కలుపుతూనే ఉండాలి. ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటారు అని అనుకుంటారు. కానీ... ఓ మహిళ మాత్రం ఇలా పది నిమిషాల్లో నెయ్యి చేసేసింది. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
ఆ వీడియో లో మహిళ చాలా సింపుల్ గా నెయ్యి తయారు చేయడం చూపించింది. నెయ్యి తయారు చేయాలంటే అాది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ప్రతిరోజూ పాలమీద లేదంటే.. పెరుగు మీద మేగడ తీసి మనం స్టోర్ చేసుకుంటాం. ఓ పది రోజుల తర్వాత మొత్తం కలిపి చేస్తాం. ఈ వీడియోలో మహిళ కూడా అదే చేసింది. అయితే.. దానిని కూడా చాలా సింపుల్ గా చేసింది.
తాను స్టోర్ చేసుకున్న మేగడ మొత్తాన్ని ఓ గిన్నెలోకి తీసుకుంది. దానిని కాస్త నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చే వరకు ఆగింది. తర్వాత.. ఆ మేగడ మొత్తాన్ని కుక్కర్ లో పెట్టి.. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసింది. ఆ తర్వాత.. కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానిచ్చింది. అంతే.. ఆ తర్వాత విజిల్ తీసి.. మరో గిన్నెలో దానిని పోసి దానిని పొయ్యి మీద పెట్టి.. ఒక్క ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది.
అలా వేడిచేసినప్పుడు నీళ్లు మొత్తం ఆవిరైపోతాయి. తర్వాత పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మరిగించాలి. ఆ తర్వాత.. నెయ్యిని వడపోసుకుంటే సరిపోతుంది. మనకు కేవలం పది నిమిషాల్లో ఫ్రెష్ నెయ్యి మనకు లభిస్తుంది. మనం ఇంట్లో నెయ్యి చేయాలంటే.. ఆ మేగడను మజ్జిగలా చేసి.. వెన్నపూస తీసి.. ఆ తర్వాత నెయ్యి చేయాల్సి ఉంటుంది. కానీ... ఈ మహిళ చెప్పిన ప్రాసెస్ లో.. అంత శ్రమ అవసరం లేదు. చాలా తర్వగా అవుతుంది. ఆమె నెయ్యి చేసిన విధానం చాలా మందిని ఆకర్షించింది. ఇంత సింపుల్ గా నెయ్యి చేయవచ్చా అని నెటిజన్లు షాకౌతున్నారు. మార్కెట్లో దొరికే నెయ్యి స్వచ్ఛమైనదో కాదో అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అదే.. ఈ నెయ్యి అయితే.. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి.. ఎలాంటి భయం లేకండా ఆస్వాదించవచ్చు.
ghee oil
నెయ్యి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు...
1.మెరుగైన జీర్ణ వ్యవస్థ..
ప్రతిరోజూ క్రమం తప్పకుండా.. ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే.. వారికి ఉన్న ఎలాంటి జీర్ణ సమస్యలు అయినా తగ్గిపోతాయట.
నెయ్యి జీర్ణ ఆరోగ్యానికి పవర్‌హౌస్. కడుపు ఉబ్బరం , గ్యాస్ వంటి సమస్యలను దూరం చేయగలదు. ఎందుకంటే నెయ్యి కడుపు ఆమ్లాల స్రావాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ ప్రక్రియను కిక్‌స్టార్ట్ చేస్తుంది. ఆహారాన్ని సున్నితంగా విచ్ఛిన్నం చేస్తుంది. అప్పుడు ఆహారం సులభంగా జీర్ణమయ్యి.. పోషకాలు మన శరీరానికి అందుతాయి.
ghee
2. టాక్పిన్స్ తొలగిస్తుంది...
మన శరీరం హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో నెయ్యి మనకు సహాయపడుతుంది .ఉదయం మీరు ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది
3. గట్ ఆరోగ్యానికి మంచిది
నెయ్యి మన గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ ప్రేగు ఆరోగ్యంగా లేకుంటే, మీరు మీ ఆహారం నుండి అవసరమైన పోషకాలను గ్రహించలేరు. మీరు ప్రతిరోజూ నెయ్యి తీసుకోవడం ప్రారంభించినట్లయితే, అది క్రమంగా మీ గట్ లైనింగ్‌ను మెరుగుపరుస్తుంది. మీ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.
4.బరువు తగ్గడానికి సహాయపడుతుంది..
అందరూ నెయ్యి తింటే బరువు పెరుగుతారు అనుకుంటారు. కానీ.. రోజూ ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యి తింటే... బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది మీ బరువు నిర్వహణ ప్రయత్నాలకు పరోక్షంగా మద్దతు ఇస్తుంది.