MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • Bonalu Special: బోనాలకు బెస్ట్ టేస్ట్: ఇలానే చేసుకుంటే మటన్ గ్రేవీ అద్భుత: అనాల్సిందే..!

Bonalu Special: బోనాలకు బెస్ట్ టేస్ట్: ఇలానే చేసుకుంటే మటన్ గ్రేవీ అద్భుత: అనాల్సిందే..!

బోనాలకు స్పెషల్‌గా, రైస్‌కి అదిరిపోయే కాంబోగా ఉండే మటన్ గ్రేవీని ఇంట్లోనే ఎలా వండాలో ఈ రెసిపీలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

3 Min read
Author : Bhavana Thota
Published : Jul 05 2025, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
మటన్ వంటకాలకు
Image Credit : Freepik

మటన్ వంటకాలకు

తెలంగాణ రాష్ట్రంలో పండుగలైనా, వేడుకలైనా మటన్ వంటకాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా బోనాల సందర్భంగా మనకు చక్కటి టేస్ట్ ఇచ్చే మటన్ గ్రేవీ తయారీకి ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ స్పెషల్ మటన్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
మారినేట్ చేయడం
Image Credit : pinterest

మారినేట్ చేయడం

ముందుగా అరకిలో మటన్‌ని శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, నూనె, నిమ్మరసం వేసి బాగా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. ఈ విధంగా మారినేట్ చేయడం వల్ల మటన్ ముక్కల్లో మసాలా బాగా కలిసి అద్భుతమైన రుచి వస్తుంది.

38
మసాలా పేస్ట్
Image Credit : Google

మసాలా పేస్ట్

ఇప్పుడు గ్రేవీకి కావలసిన మసాలా పేస్ట్ తయారు చేయాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, దాల్చిన చెక్క ముక్కలు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, ఎండు మిర్చి వేసి మెత్తగా పేస్ట్‌గా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా కలపాలి.

48
కర్రీ తయారీకి
Image Credit : Google

కర్రీ తయారీకి

ఇప్పుడు కర్రీ తయారీకి ముందడుగు వేయాలి. ఒక ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేసి జీలకర్ర వేసి వేయించాలి. తరువాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి. వెంటనే ముక్కలు చేసిన ఉల్లిపాయలు వేసి అవి బాగా బంగారు రంగు వచ్చేంతవరకు వేయించాలి.

58
మారినేట్ చేసిన మటన్ ముక్కలు
Image Credit : Google

మారినేట్ చేసిన మటన్ ముక్కలు

ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయించాలి. ఆపై ముందే మారినేట్ చేసిన మటన్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి. అప్పటికి మటన్ ముక్కలు కొంతవరకు మెత్తబడతాయి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి మరోసారి కలపాలి.

ఇప్పుడు మిక్సీలో తయారు చేసుకున్న మసాలా పేస్ట్‌ను కర్రీలో కలిపి మరో ఐదు నిమిషాల పాటు వేయించాలి. పచ్చివాసన పోయేలా నూనె పైకి వచ్చేదాకా ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి ఉప్పు జోడించి రుచి చూసుకోవాలి.

68
మటన్ గ్రేవీ
Image Credit : Google

మటన్ గ్రేవీ

ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 8 నుంచి 10 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ ఎంతమాత్రంలో ఉన్నదో బట్టి మరో రెండు నిమిషాలు మూత లేకుండా మరిగించవచ్చు. అంతే టేస్టీ మటన్ గ్రేవీ రెడీ.

ఈ మటన్ కర్రీని రైస్, బగారా రైస్, చపాతీ, రోటీ, పూరీ వంటి ఏ వంటకంతోనైనా చక్కగా కలిపి తినవచ్చు. బోనాల పర్వదినాల్లో ఇది ప్రత్యేకంగా వండి బంధుమిత్రులతో పంచుకుంటే వేడుకలో మరింత ఆనందం పొందవచ్చు.

78
మటన్ గ్రేవీ రుచి
Image Credit : Google

మటన్ గ్రేవీ రుచి

అయితే, ఈ వంటలో ప్రతి దశలో సరైన మసాలా బ్యాలెన్స్, టైమింగ్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. మటన్ గ్రేవీ టేస్టీగా రావాలంటే మారినేషన్ తప్పనిసరి. అలాగే మసాలా పేస్ట్‌కి ఉపయోగించే పొడులు, గింజలు గ్రేవీకి మరింత రుచిని ఇస్తాయి.

తెలంగాణ వంటల్లోని తీపి గుర్తుల్లా ఉండే ఈ మటన్ గ్రేవీ రుచి ఒక్కసారి తెలిసిన తర్వాత మళ్లీ మళ్లీ ఇదే రిసిపీ ట్రై చేయాలని అనిపిస్తుంది. పైగా ఈ కర్రీను ముందుగా తయారుచేసి కొంత సమయం తర్వాత తిన్నా రుచి ఇంకాస్త పెరుగుతుంది.

ఇక బోనాలకు మాత్రమే కాదు, ఇంట్లో ఏ చిన్న సెలబ్రేషన్ అయినా ఈ మటన్ గ్రేవీ వండి అందరినీ సర్‌ప్రైజ్ చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దలవరకూ అందరికీ నచ్చేలా ఉండే ఈ టేస్టీ కర్రీ రెసిపీని మీరు ఈ వారాంతాన ట్రై చేయండి.

88
ఫేవరెట్ డిష్‌గా
Image Credit : Google

ఫేవరెట్ డిష్‌గా

ఇది రెగ్యులర్ మటన్ కర్రీ కన్నా కొంచెం స్పెషల్. ఎందుకంటే ఇందులో నువ్వులు, గసగసాలు, జీడిపప్పు వంటి పోషకాలతో పాటు ప్రత్యేకమైన మసాలాలు వాడటం వల్ల రుచి, ఆరోగ్యం రెండూ సమపాళ్లలో ఉండేలా ఉంటుంది. దీన్ని ఒకసారి వండగానే మీ ఇంట్లో కొత్త ఫేవరెట్ డిష్‌గా మారిపోతుంది.

మొత్తానికి.. ఈ బోనాలకు మీ వంటల్లో ఈ మటన్ గ్రేవీకి చోటివ్వండి. సింపుల్ స్టెప్స్‌తో, ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ టేస్టీ కర్రీను తక్కువ టైమ్‌లో తయారు చేసేయవచ్చు. ఫలితం మాత్రం రెస్టారెంట్ రేంజ్ టేస్ట్ గ్యారెంటీ!

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Mutton Soup: నెల రోజులు మటన్ సూప్ తాగితే ఏమౌతుంది..?
Recommended image2
Mutton: వంకాయ మటన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ మామూలుగా ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved