MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • Monsoon Health Tips: వర్షాకాలంలో టీ, పకోడీ కలిపి తినొచ్చా? తింటే ఏమవుతుంది?

Monsoon Health Tips: వర్షాకాలంలో టీ, పకోడీ కలిపి తినొచ్చా? తింటే ఏమవుతుంది?

Tea and Pakoda: వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి టీతో పాటు కరకరలాడే పకోడీ తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. ఈ కాంబినేషన్ సూపర్ గా ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదట. ఇంతకీ టీతో పకోడి తింటే ఏమౌతుంది ? అనే విషయాలు తెలుసుకుందాం. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 03 2025, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వర్షాకాలంలో టీ, పకోడీ
Image Credit : google

వర్షాకాలంలో టీ, పకోడీ

వర్షాకాలంలో వేడి వేడి టీతో పాటు కరకరలాడే పకోడీలు, బజ్జీలు తింటుంటే.. ఆ ఆనందమే వేరు. పకోడీలను చాయ్‌తో కలిసి తింటే.. అవి మరింత రుచిగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారిదాకా అందరికీ ఈ కాంబినేషన్ ను ఇష్టపడుతారు. దీని క్రిస్పీ స్వభావం, రుచికరమైన మసాలా సువాసన వల్ల ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అయితే.. ఇవి ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయట. వర్షాకాలంలో టీ, పకోడీ ఎక్కువగా తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 జీర్ణ సమస్యలు
Image Credit : Freepik

జీర్ణ సమస్యలు

వర్షాకాలంలో ఎక్కువగా టీ తాగడం వల్ల డీహైడ్రేట్ రావొచ్చు. ఎందుకంటే టీలో ఉండే కెఫీన్ నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం ఆమ్లతను పెంచి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది, వర్షాకాలంలో ఇది మరింత సమస్యకరంగా మారవచ్చు.

36
ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుతుంది
Image Credit : Getty

ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుతుంది

వర్షాకాలంలో బోండా, పకోడీలు  (నూనెల్లో వేయించిన ఆహారపదార్థాలు) తరచూ తినడం వల్ల ట్రాన్స్‌ఫ్యాట్ శరీరంలో పెరిగి, కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం ఉత్తమం.

46
ఇన్ఫెక్షన్ ప్రమాదం
Image Credit : Freepik

ఇన్ఫెక్షన్ ప్రమాదం

వర్షాకాలంలో తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి సమయంలో రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో అమ్మే పకోడీలు తింటే విరేచనాలు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

56
బరువు పెరగడం:
Image Credit : our own

బరువు పెరగడం:

పకోడీల్లో ఎక్కువ నూనె, కార్బోహైడ్రేట్లు ఉండటంతో శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఇది బరువు పెరగడానికి, బద్ధకానికి దారితీస్తుంది. అలాగే టీతో పాటు తీసుకునే అధిక చక్కెర కూడా శరీర బరువును పెంచే ప్రధాన కారణాల్లో ఒకటి. కాబట్టి వర్షాకాలంలో వీటిని మితంగా తీసుకోవడం మంచిది.

66
 ఇవి ప్రయత్నించండి.
Image Credit : our own

ఇవి ప్రయత్నించండి.

  •  వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే.. పాల టీకి బదులుగా హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ తాగడం మంచిది. 
  • నూనెలో వేయించిన బోండా, పకోడీలకు బదులుగా తవ్వలో వేయించిన లేదా గ్రిల్ చేసిన హెల్తీ స్నాక్స్‌ను తినండి. 
  • సీజనల్ పండ్లు, వేరుశెనగ, పప్పులాంటి పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.  

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image2
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image3
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Matcha Tea: జపానీస్ హెల్త్ సీక్రెట్ మాచా గ్రీన్ టీ.. ఈటీతో ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
పిల్లలకు ఈవినింగ్ ఏ స్నాక్స్ ను పెట్టాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved