MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • పులుసు కంటే టేస్టీగా ఉండే తంజావూరు స్పెషల్ కొబ్బరి శోధి.. ఎలా చేయాలో తెలుసా?

పులుసు కంటే టేస్టీగా ఉండే తంజావూరు స్పెషల్ కొబ్బరి శోధి.. ఎలా చేయాలో తెలుసా?

Thanjavur Coconut Sodhi Recipe: తెలుగు రాష్ట్రాల్లో పులుసు ఎంత ఫేమస్సో..తంజావూరు ప్రాంతంలో కొబ్బరి శోధి అలాంటిది. దీని వాసనే చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా విభిన్నమైన రుచి వల్ల చాలా మంది దీన్ని ఇష్టపడతారు. చక్కటి ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 03 2025, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తమిళనాడులోని సాంప్రదాయ కళలకు పేరుగాంచిన తంజావూరు, రుచికరమైన వంటకాలకు కూడా ఫేమస్. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో ఒకటి కొబ్బరి శోధి ఒకటి. ఈ ప్రత్యేకమైన వంటకాన్ని ఆ ప్రాంత ప్రజలు బాగా ఇష్టపడతారు. 

పులుసు, రసం వంటి సాధారణ వంటకాల కంటే ఇది చాలా రుచికరంగా ఉంటుంది. కొబ్బరి పాలు, పచ్చి మసాలా దినుసులు కలపడం వల్ల అద్భుతమైన వాసన వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కావలసిన పదార్థాలు:

కొబ్బరిపాలు: 1 కప్పు (గట్టిగా), వేడి నీరు – 1 1/2 కప్పులు, మునగకాయ – 1 (తరిగినది), చిన్న ఉల్లిపాయలు – 10 (నలిపినవి), పచ్చిమిర్చి – 3, అల్లం – 1 అంగుళం ముక్క, బంగాళదుంప - 1, క్యారెట్ - 1, బీన్స్ - 5-6, ముసూరిపప్పు లేదా తూర్ దాల్ - ¼ కప్పు, వెల్లుల్లి - 2 రెబ్బలు (ఒకటి ముద్దగా, మరొకటి చిన్న ముక్కలుగా), పసుపు - ¼ చెంచా, ఉప్పు - రుచికి తగినంత, నువ్వుల నూనె లేదా సాధారణ నూనె - 1 టేబుల్ స్పూన్, కరివేపాకు - 1 రెబ్బ, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, కాస్తా మెంతులు (తాలింపు కోసం), నిమ్మరసం - 1 టీస్పూన్

34

తయారీ విధానం:

ముసూరిపప్పును 1 కప్పు నీటితో కుక్కర్‌లో ఉడికించి మెత్తగా మష్ చేయాలి. తరిగిన బంగాళదుంప, క్యారెట్, బీన్స్‌ను 1 కప్పు నీటితో పసుపు, ఉప్పు వేసి 5-7 నిమిషాలు మగ్గించాలి. తర్వాత పాన్‌లో నూనె వేడి చేసి, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. ఉడికించిన కూరగాయలు, మాష్ చేసిన పప్పు వేసి కలపాలి. గట్టిగా చేసిన కొబ్బరిపాలు జోడించి, మిశ్రమాన్ని మరికొద్దిసేపు మరిగించాలి. చివరిగా గట్టిగా చేసిన కొబ్బరిపాలు, నిమ్మరసం వేసి, స్టౌ ఆఫ్ చేయాలి.

 

44

కొబ్బరి శోధి వడ్డించే విధానాలు:

అన్నంతో వేడిగా వడ్డించవచ్చు. దోశ, ఇడ్లీ వంటి వాటితో కలిపి తినవచ్చు. కొద్దిగా నిమ్మరసం కలిపితే వాసన, రుచి పెరుగుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు:

కొబ్బరి పాలు మంచి కొవ్వు, ఫాస్పరస్ ను అందిస్తాయి. పెసర పప్పు, జీర్ణక్రియకు మంచిది. పసుపు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగకాయ, ఇనుము అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Recommended image3
Mutton Roast: మటన్ వేపుడు ఇలా చేశారంటే.. మీ ఫ్యామిలీ మొత్తం ఫిదా అవ్వాల్సిందే. స్వ‌ర్గం అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved