ఆపిల్ vs అరటిపండు.. తొందరగా బరువు తగ్గడానికి ఏ పండు బెస్ట్
Apple vs Banana: ఆపిల్, అరటిపండు రెండూ మంచి ఆరోగ్యకరమైన పండ్లు. వీటిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ రెండూ పండ్లూ బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

ఆపిల్, అరటిపండ్లు
బరువు తగ్గడానికి సహజ పద్దతులను పాటించడం మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. వీటిలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. బరువును తగ్గించే పండ్లలో ఆపిల్, అరటిపండ్లు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే చాలా మంది వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఈ పండ్లను తింటుంటారు. కానీ ఈ రెండింటిలో మనం బరువు తగ్గడానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు
అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండును తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉంటాయి.
అయితే ఈ అరటిపండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో మీకు ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది.
ఇకపోతే అరటిపండులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఆపిల్ ఆరోగ్య ప్రయోజనాలు
ఆపిల్ పండులో కేలరీలు తక్కువగా, పెక్టిన్ వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. అలగే కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సేపు ఉంటుంది. అలాగే ఆపిల్ లో ఉండే ఫైబర్ కంటెంట్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో జీవక్రియను పెంచే గుణాలు ఉండటం వల్ల ఇది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి ఏద బెస్ట్?
మీరు బరువు తగ్గడానికి ఆపిల్, అరటి రెండూ ఉపయోగపడతాయి. కానీ వీటిలో ఆపిల్ కొంచెం ఎక్కువ మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియకు సహాపడుతుంది.