Soft Skin: ఇంట్లో ఇవి ఉంటే మేకప్ అవసరమే లేదు.. ఇవి పెట్టినా మీ ముఖం మంచి గ్లో వస్తుంది
Soft Skin: అందంగా కనిపించాలని ఆడవారు తీరు తీరు మేకప్ లను వేస్తుంటారు. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా ముఖాన్ని మెరిసేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

అందం
మార్కెట్ లో మనం కొనే బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల మనం అప్పటి వరకు అందంగా కనిపించినా.. ఇవి మన చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే కెమికల్స్ ఉన్నవాటిని వాడకపోవడమే మంచిది. అయితే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు చర్మ సమస్యలను తగ్గించి ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె ఒక్క జుట్టుకు మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ముఖానికి పెట్టుకోవడం వల్ల ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో హైడ్రేషన్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి కొబ్బరి నూనెను ముఖానికి పెట్టుకోవడం వల్ల డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. అలాగే దురద, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. కొబ్బరి నూనె మన చర్మాన్ని లోతుగా తేమగా ఉంచుతుంది. దీన్ని పెట్టుకోవడం వల్ల చర్మం నేచురల్ గా గ్లో వస్తుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ కూడా చర్మానికి మంచి మేలు చేస్తుంది. ఇది ముడతలు, మచ్చలు, గీతలు వంటి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ముఖానికి ఉపయోగించడం వల్ల సూర్యరశ్మికి దెబ్బతిన్న చర్మం నయమవుతుంది. చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని కొన్ని రకాల సన్ స్క్రీన్ లల్లో కూడా ఉపయోగిస్తారు.
పసుపు
పసుపు కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది ముఖానికి పసుపును రాసుకుంటుంటారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి చర్మాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. అలాగే ముడతలను, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి పసుపు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపును ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పసుపును పాలతో కలిపి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం సహజంగా మెరిసిపోతుంది. పసుపు అన్ని రకాల చర్మాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
తేనె
తేనె కూడా ప్రతి వంటింట్లో ఉంటుంది. నిజానికి తేనెతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. చాలా మంది ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ ఇది అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
తేనె ఒక నేచురల్ మాయిశ్చరైజర్ కూడా. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే ముడతలు ఏర్పడవు. చర్మం సాఫ్ట్ గా ఉంటుంది. ముఖానికి తేనెను అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.
అరటిపండ్లు
అరటిపండ్లు కాలాలతో సంబంధం లేకుండా మార్కెట్ లో దొరుకుతాయి. నిజానికి ఇవి ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగపడతాయి. ఈ పండు మన చర్మాన్ని సాఫ్ట్ గా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖానికి అరటిపండు ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల చర్మం తాజాగా, హైడ్రేట్ గా కనిపిస్తుంది.
అలాగే ముఖంపై చనిపోయిన చర్మ కణాలు కూడా తొలగిస్తాయి. ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తని పేస్ట్ లా చేసి తేనె లేదా గుడ్డులోని తెల్లసొనని కలిపి ముఖానికి పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే చాలు. ఈ ఫేస్ మాస్క్ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేస్తుంది.