పిల్లలు ఉసిరికాయ తింటే ఏమౌతుందో తెలుసా?
Amla for Kids Health: ఉసిరిలో ఎన్నో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎదిగే పిల్లలు రోజూ ఒకటి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు ఉసిరి ప్రయోజనాలు
ప్రతి తల్లిదండ్రులు ఎదిగే పిల్లలకు మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని పెట్టడం చాలా అవసరం.ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లలకు ఉసిరి మంచి మేలు చేస్తుంది. 100 గ్రాములు ఉసిరికాయల్లో 20 నారింజ పండ్లకు సమానమైన విటమిన్ సి ఉంటుంది. ఇది పిల్లల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతుంది. అందుకే పిల్లల ఫుడ్ లో ఉసిరిని ఖచ్చితంగా చేర్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హిమోగ్లోబిన్
విటమిన్ సి మనం తిన్న ఆహారం నుంచి ఐరన్ ను గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల పిల్లల్లో ఐరన్ లోపం పోతుంది. వారిలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తలోపం ఉండదు.
అజీర్థి
పిల్లలకు కడుపు ఉబ్బరం, అజీర్థి, గుండెల్లో మంట వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఇవి కామన్. అయితే వీటిని తగ్గించడానికి ఉసిరి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరికాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, కడుపును శుభ్రంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఇమ్యూనిటీ
పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే అటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే వీరు ఉసిరిని తింటే వారి శరీరం అంటువ్యాధులతో పోరాడుతుంది. ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటారు. ఉసిరిలో ఉండే విటమిన్ సి పిల్లల ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది. అందుకే పిల్లల రోజువారి ఫుడ్ లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
ఆకలి పెరగడానికి
పిల్లలకు ఆకలి తక్కువగా ఉంటుంది. అయితే వీరి ఆకలి పెరగడానికి ఉసిరి సహాయపడుతుంది. మీరు పిల్లలకు రోజూ ఒక ఉసిరిని ఇస్తే వారి ఆకలి పెరుగుతుంది. దీంతో పిల్లలు బరువు కూడా పెరుగుతారు.
కంటిచూపు
ఉసిరికాయలో విటమిన్ సి తో పాటుగా విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల కంటిచూపును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి కంటిని ప్రభావితం చేసే బ్యాక్టీరియాను నాశనం చేసి పిల్లల కళ్లు బాగా కనిపించడానికి సహాయపడుతుంది.
మెమోరీ పవర్
ఉసిరిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవన్నీ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఉసిరి పిల్లల మెదడు పనితీరును మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. పిల్లల బ్రెయిన్ చురుగ్గా పనిచేయడానికి కూడా ఉసిరి సహాయపడుతుంది.