Rice: అన్నానికి బదులు వీటిని తిన్నా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు
Rice: అన్నంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు మరింత పెరుగుతారు. అయితే అన్నానికి బదులుగా కొన్ని రకాల ఆహారాలను తింటే మీరు బరువు తగ్గుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నానికి బదులు ఏం తినాలి?
వైట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని కొంచెమే తినాలనుకునేవారు కూడా ఎక్కువగానే తింటుంటారు. కానీ ఈ వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీర బరువును మరింత పెంచుతాయి. అయితే మధ్యాహ్న భోజనంలో అన్నానికి బదులుగా కొన్ని రకాల ఆహారాలను తిన్నా కూడా సులువుగా బరువు తగ్గుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలకూర సూప్
ఈ పాలకూర సూప్ లో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్నం భోజనంలో అన్నానికి బదులుగా దీన్ని తీసుకోండి. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది.
బ్రోకలీ రైస్
బరువు తగ్గాలనుకుంటే మీరు మధ్యాహ్నం అన్నానికి బదులుగా బ్రోకలీ రైస్ ను తినండి. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ుంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ రైస్ ను మధ్యాహ్నం తింటే శరీరంలో కొవ్వు తగ్గుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
బ్రౌన్ రైస్
బరువు తగ్గాలనుకునే వారు వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను తినొచ్చు. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బ్రౌన్ రైస్ ను తింటే మీ ఆకలి చాలా వరకు తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి బ్రౌన్ రైస్ చాలా మంచివి.
క్యాబేజీ రైస్
క్యాబేజీ రైస్ లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇది మీ బరువును నియంత్రణలో ఉంచుతుంది. మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు గనుక బరువు తగ్గాలనుకుంటే మధ్యాహ్నం భోజనంలో అన్నానికి బదులుగా ఈ క్యాబేజీ రైస్ ను తినండి.
బార్లీ
బార్లీ కూడా బరువు తగ్గాలనుకునే వారికి బాగా సహాయపడుతుంది. ఈ బార్లీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. బార్లీని మధ్యాహ్నం తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.
ఓట్స్
ఓట్స్ లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ షుగర్ పేషెంట్లకు మాత్రమే కాదు.. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక కప్పు ఓట్స్ లో 7.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్నం తింటే సులువుగా బరువు తగ్గుతారు.