Oats Roti : రోజూ ఓట్స్ రొట్టె తింటే ఎంత మంచిదో
Oats Roti :ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరాన్ని హెల్తీగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది ఓట్స్ ను పాలలో వేసుకుని లేదా స్మూతీగా తీసుకుంటుంటారు. కానీ దీన్ని మీరు రోటీగా కూడా తినొచ్చు.

ఓట్స్ రోటీ
ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యంగా ఉండటం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అయితే ఓట్స్ ను మనం రోటీ చేసుకుని కూడా తినొచ్చు. దీనివల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గుతారు
బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ రోటీని తింటే చాలా మంచిది. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. మీరు గనుక ఓట్స్ రోటీని తింటే కడుపు తొందరగా నిండుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అలాగే ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి. ఇది మీరు బరువు తగ్గడానికి, బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి బాగా సహాయపడుతుంది.
మలబద్దకం తగ్గుతుంది
ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే పేగులను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్ వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.
షుగర్ కంట్రోల్
డయాబెటీస్ పేషెంట్లకు ఓట్స్ రోటీ ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఎందుకంటే ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈరోటీని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. స్థిరంగా ఉంటాయి. పెరిగిన షుగర్ నియంత్రణలో ఉంటుంది. అందుకే ఇది డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఓట్స్ లో బీటా గ్లూకాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్టాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే మనం ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఓట్స్ రోటీని తింటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఓట్స్ రోటీలో విటమిన్ సి, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.
బలమైన ఎముకలు
ఓట్స్ లో కాల్షియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. మీరు గనుక ఓట్స్ రోటీని తింటే మీ ఎముకలు బలంగా ఉంటాయి, ఎముకల సాంధ్రత కూడా పెరుగుతుంది. అలాగే మీకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే ఓట్స్ రోటీ శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది.అంతేకాదు దీనిలో ఉండే జింక్, విటమిన్ ఇ లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.