Peanut Butter Recipe : పీనట్ బటర్ తో.. ఈజీ, హెల్తీ రెసిపీలు మీ కోసం..
Peanut Butter: పీనట్ బటర్ లో అధిక ప్రోటీన్, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. అలాగే.. ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పీనట్ బటర్ ను ప్రతిరోజూ ఒకే విధంగా తినకుండా కొంచెం భిన్నంగా తీసుకోండి. పీనట్ బటర్‌తో తయారు చేసే హెల్తీ రెసిపీలు ఇవే.

స్మూతీ
పీనట్ బటర్ తో హెల్తీగా స్మూతీ తయారు చేయవచ్చు. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్, 1 కప్పు బాదం, 1 కప్పు పాలు, 1 టేబుల్ స్పూన్ చియా గింజలు (అదనపు ప్రోటీన్ కోసం), కొద్దిగా తేనె వేసి అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే.. ఈజీ, హెల్తీ రెసిపీ రెడీ.
యమ్మీ యమ్మీగా టోస్ట్
టోస్ట్ కోసం.. 2 గోధుమ రొట్టెలు, 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్, బాదం లేదా ఆపిల్ ముక్కలు తీసుకోండి, ముందుగా రొట్టెను టోస్ట్ చేయండి. దానిపై పీనట్ బటర్ పూసి, బాదం లేదా ఆపిల్ ముక్కలను వేసుకుంటే.. యమ్మీ యమ్మీ టోస్ట్ రెడీ.
హెల్తీ ఓట్స్
ఇందుకోసం అర కప్పు ఓట్స్, 1 కప్పు పాలు లేదా నీరు, 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్, కొద్దిగా తరిగిన నట్స్ (బాదం, వాల్‌నట్స్), కొద్దిగా తేనె తీసుకోండి, ముందుగా ఓట్స్, పాలు/నీటిని ఒక పాత్రలో పోసి.. లైట్ ఫ్లేమ్ పై 5-7 నిమిషాలు ఉడికించండి. తర్వాత పీనట్ బటర్, నట్స్, తేనె యాడ్ చేయండి. ఇలా కేవలం 10 నిమిషాల్లో టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.
సలాడ్ :
ఒక గిన్నెలో ఆపిల్ ముక్కలు, సెలెరీ కర్రలు, బాదం లేదా ఇతర ఇష్టమైన పండ్లతో 2-3 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ వేసి తినండి. ఇది రుచికరమైన, పోషకమైన స్నాక్స్ తయారవుతుంది.
ప్రోటీన్ బాల్స్
1 కప్పు ఓట్స్, అరకప్పు పీనట్ బటర్, 1కప్పు పాలు, తేనె, 1 కప్పు చాక్లెట్ చిప్స్ లేదా తరిగిన నట్స్. వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి చిన్న బాల్స్ లాగా తయారు చేయండి. 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత తినండి. వీటిని ప్రయాణంలో, పని చేసేటప్పుడు తినడానికి అనుకూలం.
సాస్ :
2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ తేనె, కొద్దిగా తురిమిన అల్లం, కొద్దిగా మిరపకాయల పొడి వీటన్నింటినీ ఒక చిన్న గిన్నెలో వేసి బాగా కలపండి. తర్వాత వేడి నూడుల్స్ లేదా సలాడ్ పైన పోసి వడ్డించండి.
సాండ్‌విచ్ :
2 ముక్కలు గోధుమ రొట్టె, 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్, జామ్ తీసుకోండి, రొట్టె ముక్కలపై పీనట్ బటర్ ఆప్లై చేసి.. మరొక ముక్కతో మూసివేయండి. జామ్ తో వడ్డించండి. ఇలా పిల్లలకు త్వరగా బ్రేక్ ఫాస్ట్ చేసి ఇవ్వవచ్చు.
చాక్లెట్ కప్ :
అరకప్పు పీనట్ బటర్, 1 కప్పు పాలు, కోకో పౌడర్ (చక్కెర లేనిది), 1 కప్పు కొబ్బరి నూనె (కరిగించినది), 2-3 టేబుల్ స్పూన్ల తేనె వీటన్నింటినీ ఒక చిన్న గిన్నెలో వేసి బాగా కలపండి. మఫిన్ కప్పుల్లో లేదా చిన్న సిలికాన్ మోల్డ్‌లలో పోసి ఫ్రీజర్‌లో 30 నిమిషాలు ఉంచి గట్టిపడిన తర్వాత సర్వ్ చేసుకోండి.